ల‌గ్జ‌రీ కారు కొన్న మోహ‌న్ లాల్‌.. ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరిగిపోతుంది!

మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషిస్తూ స‌త్తా చాటుతున్నారు. ప్ర‌స్తుతం లిజో జోస్ పెల్లిసేరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో `లూసిఫర్`కు సీక్వెల్ సినిమా చేస్తున్నారు. వీటితో పాటు ర‌జ‌నీకాంత్ `జైల‌ర్‌` లో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మోహ‌న్ లాల్ ఓ ల‌గ్జ‌రీ కారును కొనుగోలు చేశారు. మోహన్ లాల్ దగ్గర ఆల్రెడీ అర డజన్‌ లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ లిస్ట్ లో మూడు కోట్లు విలువ చేసే లంబోర్ఘిని, ఇంకా మెర్సిడెస్ బెంజ్, టయోటా ల్యాండ్ క్రూజర్ కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన గ్యారేజీలో కొత్త కారు వచ్చి చేరింది. వైట్ కలర్ రేంజ్ రోవర్ ఎస్.యు.విని కారును మోహ‌న్ లాల్‌ కొనుగోలు చేశారు.

భార్య సుచిత్రతో కలిసి షోరూంకు వచ్చిన మోహన్ లాల్.. కారు కీస్ తీసుకున్నారు. అనంతరం స‌తీమ‌ణితో కొత్త కారులో ఇంటికి వెళ్లారు. ఇక‌పోతే ఈ కారు ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరిగిపోతుంది. ఎందుకంటే, మోహన్ లాల్ కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారు రేటు సుమారు రూ. 5 కోట్లు ఉంటుందని అంటున్నారు.

https://twitter.com/MohanlalMFC/status/1645307424260374528?s=20