ఉదయగిరి వైసీపీకి కొత్త అభ్యర్ధి..మేకపాటి ఫ్యామిలీ నుంచే.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. కీలకమైన నేతలు వైసీపీకి దూరమయ్యారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరం అవ్వడంతో నెల్లూరులో ఆ పార్టీకి కాస్త మైనస్ కనిపిస్తుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..ఈ ముగ్గురు వైసీపీకి దూరమయ్యారు. దీంతో నెల్లూరులో వైసీపీకి కాస్త ఇబ్బందులు వచ్చాయి.

అయితే ఆ ముగ్గురు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో వెంటనే ఇంచార్జ్ లని పెట్టారు..కాకపోతే నెల్లూరు రూరల్ లో ఆదాల ప్రభాకర్ రెడ్డి, వెంకటగిరిలో నేదురుమల్లి రామకుమార్ రెడ్డి, ఉదయగిరిలో ధనుంజయ రెడ్డిని ఇంచార్జ్ గా పెట్టారు. ఇక ఇందులో రూరల్ సీటులో ఆదాల పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇటు వెంకటగిరిలో నేదురుమల్లి పోటీ చేయడం ఖాయమని చెప్పవచ్చు. కానీ ఉదయగిరిలో ఇంకా బలమైన అభ్యర్ధి కోసం వైసీపీ వెతుకుతుంది. ఇదే సమయంలో మేకపాటి ఫ్యామిలీ నుంచే అభ్యర్ధి ఉంటారని తెలుస్తోంది.

చంద్రశేఖర్ రెడ్డి వెళ్లిపోవడంతో..ఆయన అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి..ఉదయగిరి వైసీపీలో పరిస్తితులు చక్కదిద్దే కార్యక్రమం చేస్తున్నారు. తాము జగన్ వెంటే నడుస్తామని అంటున్నారు. అదే సమయంలో చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె రచనా రెడ్డిని ఇంచార్జ్ గా అడిగితే పెట్టమని జగన్‌ని కోరతానని రాజమోహన్ చెప్పుకొచ్చారు.

అయితే చంద్రశేఖర్ కుమార్తెని ఇంచార్జ్ గా పెడితే ఒప్పుకునేది లేదని కొందరు వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. చంద్రశేఖర్ రెడ్డి పార్టీ వదిలినప్పుడు..ఆయన కుమార్తెని ఎలా ఇంచార్జ్ గా పెడతారని ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి చివరికి ఉదయగిరి ఇంచార్జ్‌గా ఎవరు ఉంటారు.