`ఎన్టీఆర్ 30`కి ఎవ‌రూ ఊహించ‌ని టైటిల్.. భ‌లే క్రేజీగా ఉందే!?

`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ హిట్ అనంత‌రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొర‌టాల శివ‌తో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్‌ టైటిల్ తో ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువ‌సుధ ఆర్ట్స్‌ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఒక ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఈ చిత్రానికి `వ‌స్తున్నా` అనే క్రేజీ టైటిల్ ను లాక్ చేసే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్నార‌ట‌.

ఇటీవ‌ల ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అయిన సంద‌ర్భంగా ఓ వీడియోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. అందులో ఎన్టీఆర్ `వ‌స్తున్నా..` అంటూ ప‌వ‌ర్ ఫుల్‌గా చెబుతూ సెట్స్ లోకి న‌డిచొచ్చాడు. అలాగే మొన్న‌టికి మొన్న‌ బన్నీ బర్త్ డే సందర్భంగా `పార్టీ లేదా పుష్ప` అని ఎన్టీఆర్ అడిగితే.. `వస్తున్నా` అని బన్నీ సమాధానమిచ్చాడు. ఇక అప్పటి నుంచి ఇదే `ఎన్టీఆర్ 30` సినిమా టైటిల్ అయ్యుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. బన్నీకి ముందుగా ఆ టైటిల్ గురించి తెలియడం వల్లనే ఆయన ఆ మాటను ఉపయోగించాడని అంటున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది.