ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల యంగ్ సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. అటు యువ హీరోలతో పాటు ఇటు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటూ ఫుల్ బిజీగా మారింది. టాలీవుడ్ లోకి వచ్చి రెండేళ్లు కాకముందే చేతినిండా సినిమాలతో స్టార్ హీరోయిన్లను మణికిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పూజా హెగ్డే కు తలనొప్పిగా మారింది.
ఆల్రెడీ పూజా హెగ్డే నటిస్తున్న మహేష్ బాబు 28వ చిత్రంలో ఒక హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమాలో పూజా హెగ్డే కంటే శ్రీలీల పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ సంగతి పక్కన పెడితే తాజాగా పూజ హెగ్డేకు దక్కాల్సిన మరో బంపర్ ఆఫర్ ను టక్కున లాగేసుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో `ఉస్తాద్ భగత్ సింగ్` అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఈ సినిమాలో మొదట పూజా హెగ్డేను అనుకున్నారు. కానీ, ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం శ్రీలీల చుట్టూనే తిరుగుతోంది. దీంతో పూజా హెగ్డేను కాదని పవన్ కు జోడీగా శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేశారట. కొన్ని రోజులుగా ఈ సినిమా హైదరాబాద్ – అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగు జరుపుకుంటోంది. తాజాగా ఈ షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయినట్టు తెలుస్తోంది. శ్రీలీల తొలిసారి పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా మాత్రం మేకర్స్ అనౌన్స్ చేయలేదు.