ఒరిజినల్ గొప్పదా రీమేక్ గొప్పదా ఇది ఒక అంతుచిక్కని ప్రశ్న..!

సోషల్ మీడియా వచ్చాక ప్రతి విషయంపై ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇదంతా టైం వేస్ట్ వ్య‌వ‌హ‌రం అనుకునే మాటల్లో నిజం కూడా లేకపోలేదు కానీ కొన్నిసార్లు ఒక్కో విషయం మీద జరిగే చర్చలు ఎంతో ఆలోచింపచేస్తాయి. నిన్న ఓ ఒటిటి సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం మహేష్ నటించిన ఒక్కడు కంటే తమిళ్లో విజయ నటించిన గిల్లినే చాలా బాగుంటుందని తన నివేదికలో పేర్కొంది. దీంతో ఆ ఇద్దరి హీరోల అభిమానుల మ‌ధ్య‌ సోష‌ల్ మీడియా వార్‌కు దారి తీసింది.

The Verdict: Mahesh Babu's Okkadu vs Vijay's Ghilli, Which movie is the  ultimate winner?

ఈ వ్యవహారం పరస్పరం ట్రోలింగ్ దాకా వెళ్లిపోయింది. నిజానికి ఒక్కడు సినిమా ఎన్ని భాషల్లో రీమేక్ అయినా తెలుగులో వచ్చిన చార్మినార్, కొండారెడ్డి బురుజు బ్యాక్ డ్రాప్ లో గుణశేఖర్ తీసిన దాని ముందు మిగిలినవి దిగదుడుపే. నిజానికి ఒరిజినల్ సినిమాని ఎన్ని కాపీలు తీసిన ఒరిజినల్ ను మించి తీయటం చాలా కష్టం. కానీ దీన్ని బ్రేక్ చేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. హీంది దబాంగ్ కన్నా తెలుగులో వ‌చ్చిన‌ గబ్బర్ సింగ్ చాలా బాగుటుంది అనేది వాస్తవం.

Lucifer vs Godfather: లూసిఫర్ వర్సెస్ గాడ్ ఫాదర్... కీలకమైన ఆ మూడు పాత్రల  నటనలో పైచేయి ఎవరిది? - OK Telugu

పెదరాయుడులో రజినీకాంత్, మోహ‌న్‌బాబు స్క్రీన్ ప్రెజెన్స్ ముందు దీని రీమేక్‌ తమిళ నాట్టమైలో విజయ్ కుమార్ తేలిపోతాడు. చినతంబిలో ప్రభు కంటే చంటిలో వెంకటేష్ నటన ప‌ది రేట్టు బాగుటుంది. మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, ఘరానా మొగుడు, హిట్లర్, నువ్వు వస్తావని, ఖుషి ఇలా చాలా సినిమాలే ఉన్నాయి.. కానీ అవన్నీ రీమిక్‌ సినిమాలైనా ఆ భాషలో ఎన్నో సంచలనమైన రికార్డులు సృష్టించాయి. హిందీలో చరిత్ర సృష్టించిన జంజీర్, రోటి కపడా మకాన్, ముకద్దర్ కా సికందర్, డాన్ వంటి సినిమాలు తెలుగులో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

Lucifer vs Godfather: లూసిఫర్ వర్సెస్ గాడ్ ఫాదర్... కీలకమైన ఆ మూడు పాత్రల  నటనలో పైచేయి ఎవరిది? - OK Telugu

మొన్నటికీ మొన్న వచ్చిన బుట్ట బొమ్మ సినిమా ఒరిజినల్ భాషలో సూపర్ హిట్ అవ్వగా ఇక తెలుగులో మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. అలాగే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా మలయాళం సూపర్ హిట్ లూసిఫర్‌కు రీమేక్ గా వచ్చింది. కానీ ఈ సినిమా ఆ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. భీమ్లా నాయక్ సైతం తొంబై కోట్ల లోపే ఆగిపోయింది. ఇది ఎప్పటికీ ఎడతెగని చర్చ లాగానే కొనసాగుతుంది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతీయ సినిమాలో రీమేక్‌ల‌ పర్వం ఇప్పటిది కాదు. ఇకపై అది ఆగేది కూడా కాదు. కాకపోతే సోషల్ మీడియా విపరీతంగా పెరగడంతో ప్రేక్షకులలో ఇలాంటి పెడధోరణులు వస్తున్నాయి.