హీరోయిన్‌గా మెగా డాటర్ రీ ఎంట్రీ.. అందుకేనా ఈ హాట్ ఫోటోషూట్లు..!

మెగా డేటర్‌ నిహారిక మళ్ళీ హీరోయిన్‌గా రీఎంట్రీ ఇవ్వబోతుందా.. అంటే అవును అనే సమాధానం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మెగా కుటుంబం నుంచి హీరోయిన్‌గా వచ్చిన మొదటి అమ్మాయి కూడా నిహారికనే. యువ హీరో నాగ శౌర్యతో కలిసి ఒక మనసు సినిమాతో టాలీవుడ్‌ లో హీరోయిన్‌గా పరిచయమైంది నిహారిక. మొదటి సినిమా నిహారికకు సక్సెస్ ఇవ్వకపోయినా ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన నిహారికకు హిట్ అందించలేకపోయాయి.

Glamorous Actress Niharika Konidela Awesome Photoshoot | Glamorous Actress  Niharika Konidela Awesome Photoshoot - @niharikakonidela, Actressniharika

ఇక దీంతో హీరోయిన్‌గా సక్సెస్ అవ్వకపోవడంతో ఈ మెగా డాటర్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. మూడు సంవత్సరాల క్రితం జొన్నలగడ్డ చైతన్యను నిహారిక వివాహం చేసుకునీ వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. ఎంతైనా సిని కుటుంబంలో పుట్టి పెరగడం వలన ఆ రంగంపై తన మక్కువను చంపుకోలేక నిర్మాణ రంగంలో అడుగుపెట్టి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్‌ను స్థాపించింది. పెళ్లి తర్వాత ఈ బ్యానర్ లో వరుస వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ భారీ విజయాలను అందుకుంది.

On Niharika Konidela's Birthday, Her Husband, Chaitanya Shares Heartfelt  Wish, Calls Her 'Sunflower'

ఇక నిహారిక మూడేళ్ల వివాహ జీవితంలో తన భర్త చైతన్యతో విభేదాలు వచ్చాయని ఈ జంట విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వార్తలు నిజం అనుకునేలా ఈ ఇద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వారి పెళ్లి ఫోటోలను తొలగించుకున్నారు. అయితే ఈ విషయంపై మెగా కుటుంబం కానీ, నిహారిక కానీ నోరు మెదపడం లేదు.

ఇక ఇప్పుడు ఈ విషయాలను పక్కన పెడితే.. గత కొన్ని రోజులుగా నిహారిక సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్లతో మెగా అభిమానులను పిచ్చెక్కిస్తుంది. ఈ ఫోటోలను చూస్తుంటే త‌న విడాకుల రూమర్స్ ను ఆపడానికి పెడుతుందా.. లేక మళ్ళీ హీరోయిన్ గా రియంట్రీ ఇవ్వబోతుందా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో నిహారిక పెట్టిన హాట్ ఫోటోలు మాత్రం నేటిజన్లను బాగా కవ్విస్తున్నాయి.