పాణ్యంలో కష్టపడుతున్న చరిత..వైసీపీకి చెక్ పడుతుందా?

ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం..వైసీపీకి కంచుకోట అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అడ్డా అని చెప్పవచ్చు..ఇక్కడ కాటసాని 6 సార్లు గెలిచారంటే..ఆయనని పాణ్యం ఎలా ఆదరిస్తుందో చూడవచ్చు. ఇక ఇక్కడ టి‌డి‌పికి పెద్ద పట్టు లేదు. 1983లో ఒకసారి టి‌డి‌పి గెలవగా, మళ్ళీ 1999 ఎన్నికల్లోనే గెలిచింది. ఇంకా అంతే మళ్ళీ ఎప్పుడు గెలవలేదు. 1985, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో కాటసాని వరుసగా కాంగ్రెస్ నుంచి గెలిచారు.

2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 60 వేల ఓట్ల వరకు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచారంటే..ఆయన బలం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ కాటసాని వైసీపీలో చేరడం…2019 ఎన్నికల్లో సీటు దాదాపు ఆయనకే ఫిక్స్ కావడంతో అప్పటివరకూ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న గౌరు చరిత రెడ్డి..వైసీపీని వదిలి టి‌డి‌పిలోకి వచ్చారు. వైఎస్సార్ శిష్యురాలుగా ఉన్న ఆమె..వైసీపీని వదిలేసి టి‌డి‌పిలోకి వచ్చారు.

ఇక 2019 ఎన్నికల్లో కాటసాని వైసీపీ నుంచి, చరిత టి‌డి‌పి నుంచి పోటీ చేశారు. కానీ విజయం కాటసానిని వరించింది. దాదాపు 43 వేల ఓట్ల భారీ మెజారిటీతో కాటసాని గెలిచారు. అయితే ఇప్పటికీ పాణ్యంలో కాటసానికి లీడ్ ఉంది. కానీ గత ఎన్నికల్లో వచ్చినంత ఆధిక్యత మాత్రం లేదని చెప్పవచ్చు. టి‌డి‌పి ఇంచార్జ్ గా చరిత బాగా కష్టపడుతున్నారు. మళ్ళీ ప్రజల మద్ధతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె బలం పెరిగింది..ప్రజల్లో ఆమెపై సానుభూతి ఉంది. ఇంకొంచెం కష్టపడితే పాణ్యంలో చరిత గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ కాటసాని లాంటి బలమైన నాయకుడుని ఓడించడం కష్టమైన పని. చూడాలి మరి చరిత ఈ సారి గెలుస్తారో లేదో.