అక్కినేని వంటి బడా సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సుశాంత్ ఒకడు. అక్కినేని నాగేశ్వరరావు మనవడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన సుశాంత్.. కరెంట్, అడ్డా చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత సినిమాల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా సుశాంత్ కు హీరోగా నిలదొక్కుకోవడం చాలా కష్టంగా మారింది.
దాంతో `అలా వైకుంఠపురములో` సినిమాతో సహాయక పాత్రలను పోషించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తాజాగా `రావణాసుర` సినిమాలో ఓ కీలక రోల్ ను ప్లే చేశాడు. మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 7న అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుశాంత్‌కు పెళ్లిపై ప్రశ్నలు ఎదురయ్యాయి.
సుశాంత్ ఏజ్ 37. ఈ నేపథ్యంలోనే యాంకర్ పెళ్లెప్పుడు చేసుకుంటారు..? అని ప్రశ్నించగా.. `పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ హ్యాపీ గా ఉంటాను అనిపించాలి. అప్పుడే పెళ్లి చేసుకుంటా. అయితే పెళ్లి తర్వాత హ్యాపీ గా ఉండరు అనేది నా అభిప్రాయం కాదు. నాకు ఇంకా ఆ టైమ్ రాలేదని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఫోకస్ మొత్తం సినిమాల మీద తప్ప పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు` అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో పెళ్లి విషయంలో అక్కినేని హీరో ఫుల్ క్లారిటీతో ఉన్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.