అప్పట్లో హీరోల క్రేజ్ కేవలం ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యేది.టాలీవుడ్ హీరోలకు టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ లో క్రేజ్ ఉండేది. కానీ హీరోలకు మించిన రేంజ్‌లో అన్నీ ఇండస్ట్రీలలో కూడా స్టార్ హీరోయిన్‌గా ఏకంగా కొన్నాళ్లపాటు హవా నడిపించింది శ్రీదేవి. ఇక భారతీయ చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా ప్రేక్షకుల మదిలో గుడి కట్టుకుంది అని చెప్పాలి.
తిరుపతి మూలాలు ఉన్న శ్రీదేవి తమిళ్‌లో ముందుగా హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. అలా ఆ తర్వాత టాలీవుడ్ లో అటు వెంటనే బాలీవుడ్‌లో కూడా స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకుంది. ఇక ఆమె నటించని హీరోలు ఎవ్వరూ లేరు. అమితాబ్ బచ్చన్ నుంచి మొదలుకొని రజినీ, కమల్, చిరు ఇలా అందరితోనూ జంట కట్టేసింది. ఆమెకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. అయితే శ్రీదేవీ పెళ్లి విషయంలో మాత్రం ఆమె తల్లి ఎక్కువగా ఆలోచనలు చేస్తు ఉండేది.
అయితే శ్రీదేవీ పెళ్లి విషయంలో మాత్రం ఆమె తల్లి ఎంతో మంది స్టార్ హీరోలను తన కూతురుని పెళ్లి చేసుకోమని అడిగిందట. ముందుగా ఆమె స్టార్ హీరో కమల్‌ను శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగిందట. అయితే అప్పుడు కమల్ హాసన్ వింత సమాధానం ఇచ్చాడట. మేము పెళ్లి చేసుకుంటే.. మీరు భరించలేరని, నాతో మీ కూతురు ఉండాలేదని రోజూ మీ కూతురు మీ ఇంటికి వచ్చేస్తుంటుందని సరదాగా వ్యాఖ్యానించాడట.
అయితే తర్వాత కమల్ హాసన్ మాత్రమే కాకుండా జేడీ చక్రవర్తి, రాజశేఖర్ వంటి హీరోలని కూడా శ్రీదేవి తల్లి అడిగిందట. శ్రీదేవీని పెళ్లి చేసుకోమని రాజశేఖర్, చక్రవర్తిలను కూడా ఆమె తల్లి అడిగిందని తెలుస్తోంది. రాజశేఖర్ ఫ్యామిలీ, శ్రీదేవీ ఫ్యామిలీకి రిలేషన్ ఉందట. రాజశేఖర్ తండ్రి, శ్రీదేవి తండ్రి ఇద్దరు మంచి స్నేహితులు. శ్రీదేవి, రాజశేఖర్ లకు పెళ్లి చేయాలని కూడా వీళ్ళు నిశ్చయించారు.
అయితే రాజశేఖర్ తల్లిగారు ఒప్పుకోలేదట. సినీ పరిశ్రమకి చెందిన అమ్మాయిని పెళ్లిచేసుకోవద్దని ఆమె రాజశేఖర్ తో ప్రమాణం చేయించుకుందట. చిరవకు శ్రీదేవీ మాత్రం బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. శ్రీదేవి దుబాయ్‌లో పెళ్లికి వెళ్లి.. అక్కడే హోటల్ బాత్రూంలో పడి మరణించిన సంగతి తెలిసిందే. ఇక శ్రీదేవీ మరణం పట్ల కూడా ఎన్నో అనుమానులు కూడా తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే.