నెల్లూరు సీట్లపై బాబు క్లారిటీ..ఆ రెండిటిల్లో డౌట్?

ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు వైసీపీకి అనుకూలంగా సాగిన రాజకీయం ఇప్పుడుప్పుడే టి‌డి‌పి వైపు వెళుతుంది. జిల్లాలో వైసీపీ బలం తగ్గుతుండగా, టి‌డి‌పి బలం పెరుగుతూ వస్తుంది. పైగా ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ముగ్గురు కూడా రెడ్డి వర్గం ఎమ్మెల్యేలే కావడం మరింత ఎఫెక్ట్ పడుతుంది.

ఇక వారు టి‌డి‌పి వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో టి‌డి‌పికి పట్టు పెరుగుతూ వస్తుంది. జిల్లాలో టి‌డి‌పికి ఊహించని విధంగా బలం పుంజుకుంటుంది. అయితే ఈ సారి జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని టి‌డి‌పి చూస్తుంది. ఈ క్రమంలోనే గతానికి భిన్నంగా చంద్రబాబు ముందుగానే సీట్లు ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలకు సీట్ల విషయంలో క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు. జిల్లాలో 10 సీట్లు ఉంటే అందులో కొన్ని సీట్లలో అభ్యర్ధులు దాదాపు ఖరారు అయ్యారని చెప్పవచ్చు.

నెల్లూరు సిటీలో మళ్ళీ మాజీ మంత్రి నారాయణ పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇటు నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బరిలో దిగుతారని తెలుస్తోంది. ఆయన ఎన్నికల ముందు టి‌డి‌పిలోకి వచ్చి పోటీ చేయనున్నారని సమాచారం. ఇక కోవూరులో దినేష్ రెడ్డి పోటీ చేస్తారు. వెంకటగిరిలో కురుగండ్ల రామకృష్ణ పోటీ చేస్తారా? లేక వైసీపీని వీడిన ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తారనేది క్లారిటీ రావాలి. గూడూరులో సునీల్ కుమార్ ఉన్నారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేయడం ఖాయమే.

ఉదయగిరిలో క్లారిటీ లేదు..అక్కడ పోటీ ఎక్కువ ఉంది. కావలిలో కూడా అదే పరిస్తితి కనిపిస్తుంది. ఇక ఆత్మకూరులో ఆనం లేడా ఆయన కుమార్తె కైవల్య పోటీ చేయవచ్చని సమాచారం. మొత్తానికైతే నెల్లూరులో దాదాపు సీట్లు ఫిక్స్ అని చెప్పవచ్చు.