కర్నూలు సిటీలో సీటు ఇష్యూ..వైసీపీలో డౌట్..టీడీపీలో క్లారిటీ.!

రాష్ట్రంలో వైసీపీలో ఆధిపత్య పోరు చాలాచోట్ల నడుస్తున్న విషయం తెలిసిందే. పలు స్థానాల్లో తీవ్ర స్థాయిలో నేతల మధ్య రచ్చ జరుగుతుంది. ముఖ్యంగా సీట్ల విషయంలో పంచాయితీ ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా చోట్ల పంచాయితీ ఉంది. అందులో కీలకంగా కర్నూలు సిటీలో రచ్చ ఎక్కువ ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది..అది కూడా స్వల్ప మెజారిటీలతోనే..ఇక అలా గెలిచిన సీట్లలో ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న పోరు మెజారిటీని మరింత తగ్గించేలా ఉంది.

ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ ఉన్నారు..అయితే ఈయన పనితీరుకు మంచి మార్కులు ఏమి పడటం లేదు. అదే సమయంలో ఈ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ట్రై చేస్తున్నారు. అయితే ఈయన 2014లో వైసీపీ నుంచే గెలిచారు..ఇక తర్వాత వైసీపీ నుంచి టి‌డి‌పిలోకి వెళ్లారు. అయితే 2019 ఎన్నికల్లో ఈయనకు టి‌డి‌పి సీటు విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఎన్నికల ముందు మళ్ళీ వైసీపీలోకి జంప్ చేశారు.

కానీ అక్కడ సీటు రాలేదు..వైసీపీ సీటు హఫీజ్‌కు దక్కింది..ఆయన 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక ఇప్పుడు ఈ సీటు కోసం మోహన్, హఫీజ్ పోటీ పడుతున్నారు. దీంతో సీటు ఎవరికి దక్కుతుందో అర్ధం కాకుండా ఉంది. ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించేలా లేరు. దీంతో వైసీపీకే నష్టం.

అటు టి‌డి‌పి నుంచి మళ్ళీ టీజీ భరత్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిన భరత్..ఈ సారి ఖచ్చితంగా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు. అయితే ఆయనకు గెలుపు అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి.