మంచు మ‌నోజ్‌కు రామ్ చ‌ర‌ణ్ గిఫ్ట్‌గా పంపిన ఆ బొమ్మ ఖ‌రీదు తెలిస్తే మైండ్‌బ్లాకే!

మంచు వారి అబ్బాయి, టాలీవుడ్ హీరో మ‌నోజ్ గ‌త నెల‌లో ఓ ఇంటి వాడు అయిన సంగ‌తి తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక‌ రెడ్డితో మ‌నోజ్ ఏడ‌డుగులు వేశాడు. మ‌నోజ్ తో పాటు మౌనిక‌కు కూడా ఇది రెండో వివాహ‌మే. మంచు ల‌క్ష్మి నివాసంలో మనోజ్‌, మౌనిక పెళ్లి అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది.

అయితే మౌనిక‌తో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన మంచు మ‌నోజ్ కు తాజాగా రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న జంట‌ వెడ్డింగ్ గిఫ్ట్ పంపారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. స్పానిష్ సంస్థ లాడ్రో తయారుచేసిన బొమ్మను మనోజ్‌కు బహుమతిగా ఇచ్చారు చరణ్-ఉపాసన.

అయితే ఈ బొమ్మ ఖ‌రీదు తెలిస్తే మైండ్‌బ్లాక్ అయిపోతుంది. కొత్త జంట ఒకరినొకరు చూసుకుంటూ గాలిలో ముద్దాడుకోబోతున్నట్టుగా ఉండే ఈ బొమ్మ స్పెయిన్‌లో తయారైంది. గ్లాసీ ఫినిష్‌తో ఎంతో అందంగా ఉన్న ఈ బొమ్మ ఖ‌రీదు ఏకంగా రూ. 70,500. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతారు. కాగా, లాడ్రో సంస్థ రూ.10 వేల నుంచి రూ.6 లక్షల వరకు ధరల కలిగిన బొమ్మలను ఇండియాలో విక్రయిస్తోంది.

https://twitter.com/HeroManoj1/status/1644961595569885185?s=20