`విరూపాక్ష` అంటే అర్థం తెలుసా.. తేజ్ మూవీకి ఆ టైటిల్ పెట్ట‌డం వెన‌క ఇంత క‌థ ఉందా?

సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తాజాగా `విరూపాక్ష` అనే మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు.

సుకుమార్ క‌థ‌, స్క్రీన్ ప్లే అందించాడు. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. చేతబడి, తాంత్రిక విద్యల ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం నిన్న అట్ట‌హాసంగా విడుద‌లై తొలి ఆట నుంచే హిట్ టాక్ ను అందుకుంది. భారీ ఓపెనింగ్స్ ను రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది.

ఇక‌పోతే విరూపాక్ష అంటే అర్థం ఏంటి..? అస‌లు ఆ టైటిల్ ను ఈ సినికు ఎందుకు పెట్టారు..? వంటి ప్ర‌శ్న‌లు చాలా మందిలో ఉన్నాయి. విరూపాక్ష అంటే రూపంలేని కన్ను అని అర్థం. శివుని మూడో కన్నును విరూపాక్ష అంటారు. ఈ సినిమాలో కూడా రూపంలేని శక్తితో హీరో పోరాడుతుంటాడు. అందుకే సినిమాకు విరూపాక్ష అని పేరు పెట్టారు. అద‌న్న‌మాట విరూపాక్ష టైటిల్ వెన‌కున్న క‌థ‌.