ముసలి ముఖం అంటూ సమంతపై దారుణమైన ట్రోలింగ్.. అమ్మడు ఇచ్చిన రిప్లై ఇదే!

టాలీవుడ్ అగ్రతార సమంత టైటిల్ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ సినిమా అభిమానుల్లో ఎన్నో అంచనాలను పెంచేసింది. తీరా రిలీజ్ అయ్యాక అది తీవ్ర నిరాశపరిచింది. ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాలో అసలు ఏమీ లేదని క్రిటిక్స్ దారుణంగా విమర్శించారు. ఇక అభిమానులకు కూడా ఈ సినిమా అంతగా నచ్చలేదు. దాంతో సమంతకి ఊహించని షాక్ తగిలినట్లు అయ్యింది. ఒక వైపు సినిమా ఫెయిల్యూర్, మరోవైపు విమర్శలు సమంతని తీవ్ర బాధలోకి నెట్టేసాయి. ఇక నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టి ఆమెపై దారుణమైన కామెంట్స్ చేశాడు.

ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నటి ముఖం ముసలిది అయిపోయిందని, ఆమె శకుంతల పాత్ర వేయడం ఏంటని అతను చేసిన కామెంట్స్‌ దేశవ్యాప్తంగా అందరినీ నివ్వెరపరిచేలా చేశాయి. ఈ వ్యాఖ్యలతో పాటు అతను సమంత జబ్బు గురించి కూడా సంచలన ఆరోపణలు చేశాడు. సమంత సింపతి పొందాలని తన జబ్బు గురించి చెప్పుకుంటూ నాటకాలు ఆడుతోందని అతడు కామెంట్స్‌ చేశాడు.

కాగా సమంత వీటిపై ఎట్టకేలకు పెదవి విప్పింది. ఆమె చిట్టిబాబు చెవులలో నుంచి బయటికి పొడుచుకు వచ్చిన వెంట్రుకల గురించి కామెంట్స్ చేసిందట. సాధారణంగా టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉంటే ఇలా చెవిలో నుంచి వెంట్రుకలు బయటికి వస్తాయని ఆమె ఒక పోస్టులో పేర్కొంది. తర్వాత టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉండటం వల్లే చిట్టి బాబు ఇలా తనపై పిచ్చి వ్యాఖ్యలు చేసినట్లు ఆమె పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఈ పోస్టు షేర్ చేసినట్లు నెటిజన్లు అంటున్నారు కానీ ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఈ పోస్ట్ అయితే కనిపించడం లేదు. బహుశా దీనిని ఆమె డిలీట్ చేసి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే సమంత ప్రస్తుతం తన వెబ్ సిరీస్ సిటాడెల్‌ ప్రమోషన్ల కొరకు లండన్ వెళ్ళింది.