చైతూను స‌మంత ఇంకా మ‌ర‌చిపోలేదు అన‌డానికి ఇంత‌కంటే సాక్ష్యం కావాలా?

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన నాగ చైతన్య సమంత కొద్ది నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట‌.. పెళ్లి తర్వాత నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. విడాకులు తీసుకుని ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. అయితే సమంత చైతూను ఇంకా మర్చిపోలేదని అంటున్నారు నెటిజ‌న్లు. అందుకు కారణం లేకపోలేదు.

ఇటీవ‌ల కాలంలో ఫ్యాషన్ పేరుతో శరీరంలోని అనేక భాగాలపై టాటూలు వేయించుకోవడం సర్వసాధారణమైపోయింది. కొందరు తమ మచ్చలను దాచుకునేందుకు టాటూలు వేయించుకుంటే.. మరికొందరు ప్రేమించిన వారి పేర్లతో టాటూలు వేయించుకుంటున్నారు. అదేవిధంగా నటి సమంతకు కూడా నాగ‌చైత‌న్య పేరును చెస్ట్ భాగానికి దిగువన పక్కటెముకలకు పై భాగంలో టాటూ వేయించుకుంది.

 

అయితే 2021లో చైతూతో విడిపోయిన సామ్.. తన సోషల్ మీడియా ఖాతా నుంచి చైతూతో దిగిన ఫొటోలన్నింటిని డిలీట్ చేసింది. అతడితో సంబంధమున్న వాటిని తొలగించింది. కానీ ఇంత వరకు పచ్చబొట్టును మాత్రం తొలగించలేదు. స‌మంత తాజా పిక్స్ లో చైతు పచ్చబొట్టు ఇంకా ఆమె శ‌రీరంపై ఉండటాన్ని గుర్తించిన నెటిజ‌న్లు.. ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. చైతూను స‌మంత ఇంకా మ‌ర‌చిపోలేదు అన‌డానికి ఇంత‌కంటే సాక్ష్యం కావాలా అంటూ కామెంట్లను విసురుతున్నారు.