దురదృష్టం అంటే ఇదే.. కట్టప్ప పాత్రను చేజేతులా వదిలేసుకున్న స్టార్ హీరో..!

ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ మూవీలో కీలక పాత్రలలో కనిపించిన ప్రతి ఒక్కరి జన్మ ధన్యమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా కట్టప్ప రోల్ ఈ సినిమాలో సూపర్ హైలెట్ అయింది. దీనిని తమిళ్ హీరో సత్యరాజ్‌ పోషించాడు. ఈ పాత్రకు సత్యరాజ్‌ 100% న్యాయం చేశాడు. ప్రభాస్‌కి విధేయుడిగా, సాయుధ దళాల జనరల్‌గా సత్యరాజ్ అద్భుతంగా నటించి ఆశ్చర్యపరిచాడు. అయితే నిజానికి ఈ పాత్ర ఈ నటుడి కంటే ముందు ఒక బాలీవుడ్ హీరో వద్దకు వెళ్ళింది. అతడు మరెవరో కాదు కేజీఎఫ్ 2లో అధీరా పాత్ర పోషించిన సంజయ్ దత్.

సంజయ్ దత్ బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ మూవీతో ఈ నటుడు బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఎత్తు, పొడుగు బాగా ఉండే సంజయ్ దత్ సైనికాదళ నాయకుడిగా బాగా సూట్ అవుతాడని రాజమౌళి భావించాడు. అందుకే అతడి వద్దకు వెళ్లి కట్టప్ప పాత్రను ఆఫర్ చేశాడు. అయితే పాత్రలో బలం లేదని చెబుతూ సంజయ్ దత్ ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడు. వాస్తవానికి బాహుబలి సినిమా మొత్తంలో కట్టప్ప పాత్రలో ఉన్నంత బలం మరే పాత్రలో లేదంటే అతిశయోక్తి కాదు. పార్ట్-1లో ప్రభాస్‌కి ఎంతో విధేయుడుగా ఉండే కట్టప్ప బాహుబలిని చంపుతాడు. ఇక్కడ ఆ పాత్ర ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కూడా కలిగించింది.

అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా సినిమా చూసిన వారందరిలో కలిగింది. ఈ సీన్ కూడా బాగా వైరల్ అయింది. ఇప్పటికీ బాహుబలి సినిమా చెప్పగానే ముందుగా కట్టప్ప పాత్రే గుర్తుకు వస్తుంది. అలాంటి మంచి పాత్రను సంజయ్ దత్ చేజేతులా వదిలేసుకున్నాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీని గురించి తెలుసుకున్న ఫ్యాన్స్ “అదృష్టం కాళ్ళ ముందుకు వస్తే తన్ని తరిమేయడం అంటే ఇదే” అని కామెంట్లు చేస్తున్నారు.