గోపీచంద్ తండ్రి గురించి ఈ విషయాలు తెలుసా..?

టాలీవుడ్ లో ఒకప్పుడు విలన్ గా నటించి హీరోగా ఎన్నో సినిమాలతో విజయాన్ని అందుకున్న హీరో గోపీచంద్. ఇక ఈయన ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి.. గోపీచంద్ తండ్రి గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉండవచ్చు. తన తండ్రి పేరు తొట్టెంపూడి కృష్ణ.. పుట్టింది వరంగల్.. సినిమాల మీద మక్కువ ఉండటంతో డిగ్రీ అయ్యాక మద్రాస్ వెళ్లి అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకుంటూ సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో అనుభవాన్ని సంపాదించుకున్నాడు.

Lost Our Dad For 9 Years .. Now It Seems: Gopichand Emotional
మద్రాస్ లో ఎంతో మంది సినిమాల చాన్సుల కోసం ప్రయత్నిస్తూ ఉండేవారు.. కానీ గోపీచంద్ వాళ్ళ నాన్నకు మాత్రం మంచి మంచి అవకాశాలే అందాయి. మద్రాస్ వెళ్ళగానే హెచ్ ఎం రెడ్డి వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు. అక్కడ ఎం.వి రాజన్ వద్ద ఎడిటింగ్ శిక్షణ అందుకున్నాడు. ఆ తరువాత దాదాపు 30 కి పైగా సినిమాలకు ఎడిటర్ గా పని చేశారు. ఎడిటర్ అయిపోయిన వెంటనే డైరెక్షన్ రంగం లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Gopichand wishes wife Reshma on 7th wedding anniversary | Telugu Movie News  - Times of India
ఇక అప్పట్లోనే ఎన్నో విజయవంతమైన సినిమాలను డైరెక్షన్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు కృష్ణ… కృష్ణ డైరెక్షన్ చేసిన సినిమాలలో. ఉపాయంలో అపాయం ఈ సినిమా సూపర్ స్టార్ తో తీశారు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాలను అందుకుంది. ఆ తరువాత నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, వందేమాతరం, ప్రతిఘటన, రేపటి పౌరులు ఇలా మంచి మంచి సినిమాలను చేసి ఒక గుర్తింపును పొందాడు తోటెంపూడి కృష్ణ.. ఇంతటి బ్యాగ్రౌండ్ ఉండి కూడా గోపీచంద్ హీరోగా మొదట్లో ఎంట్రీ కోసం చాలా ఇబ్బందులు పడ్డారు.. అలా నెమ్మదిగా ఎదుగుతూ ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకున్నారు గోపీచంద్ తాజాగా రామబాణం అనే సినిమాలో నటిస్తున్నారు.