అల్లు అర్జున్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా ఏదో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన టీజర్ ఎంత‌లా ఆక‌ట్టుకుందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక‌పోతే బ‌న్నీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెరపైకి వస్తున్నాయి. అయితే బన్నీ తన కెరీర్ లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా ఒక‌టి ఉంది. అదేంటో తెలుసా.. రుద్రమదేవి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో గుణశేఖర్ రూపొందించిన చిత్రమిది.

ఇందులో అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, నిత్యా మీన‌న్‌, కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రుద్ర‌మ‌దేవి సినిమా క‌ష్టాల్లో ఉంద‌ని తెలుసుకున్న బ‌న్నీ.. దానికి త‌న‌లాంటి స్టార్ కావాల‌ని భావించాడు. ఇక గుణ‌శేఖ‌ర్ తో ఉన్న స‌న్నిహిత్యం నేప‌థ్యంలో రుద్ర‌మ‌దేవి చిత్రానికి పైసా రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా `గోన‌గ‌న్నారెడ్డి` పాత్ర‌ను పోషించి తన మంచి త‌నాన్ని చాటుకున్నాడు. 2015లో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది.