ఆరెంజ్ చిత్రంలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ లో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇందులో హీరోయిన్గా జెనీలియా నటించినది.ఈ సినిమా మంచి కథతో వచ్చినప్పటికీ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది..ఇదే సినిమా ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలై బాగానే కనెక్షన్లను రాబట్టింది.ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా కథ బాగానే ఆకట్టుకుంది.

ఈ సినిమా సక్సెస్ కావడానికి దాదాపుగా 10 సంవత్సరాలు పట్టడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరొకసారి ఈ సినిమాలోని నటించిన నటీనటులను గుర్తుకు చేసుకుంటున్నారు అభిమానులు. హీరోయిన్గా జనీలియాతో పాటు మరొక హీరోయిన్ కూడా నటించింది.. ఆమె రుబా అనే పాత్రలో నటించింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ కుర్రకారుల హృదయాలను దోచుకుంది. ఈమె అసలు పేరు షాజన్ పదమ్సీ. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ఎక్కువగా హిందీ సినిమాలలో నటించింది.

ఈమె తల్లిదండ్రులు కూడా ఇండస్ట్రీ ప్రాంతానికి చెందినవారే అలా వారి హోదాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ. మొదటిసారిగా రాకెట్ సింగ్.. సేల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఏడాది తమిళ ఇండస్ట్రీ తో పాటు ఆరెంజ్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. కానీ ఈ సినిమాలో ఈమెకు అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.బాలీవుడ్ లో పాటు తెలుగులో మరొకసారి మసాల సినిమాలో నటించింది. కానీ ఇది కూడా సక్సెస్ కాలేకపోయింది. సినిమాలకు దూరంగా ఉన్న ఈమె సూపర్ డమల్ అనే టీవీ షోలో పోస్టుగా చేస్తోంది. సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గానే ఉంటుంది తనకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఇమే ప్రస్తుతం బుల్లితెర పైన హోస్టుగా చేస్తోంది. తెలుగులో రీయంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.