మాస్ మహారాజా రవితేజ నుంచి తాజాగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ `రావణాసుర`. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ ఇందులో హీరోయిన్లుగా నటించారు.
సుశాంత్, జయరామ్, శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏప్రిల్ 7న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో తొలి రోజు బక్సాఫీస్ వద్ద ఊచకోత కోశాడు. అంచనాలను మించిన వసూళ్లను రాబట్టాడు.
తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు రూ. 4.29 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. వరల్డ్ వైడ్ గా రూ. 4.85 కోట్ల షేర్ ని సాధించింది. ఇక ఏరియాల వారీగా రావణాసుర టోటల్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 1.64 కోట్లు
సీడెడ్: 70 లక్షలు
ఉత్తరాంధ్ర: 61 లక్షలు
తూర్పు: 30 లక్షలు
పశ్చిమ: 21 లక్షలు
గుంటూరు: 45 లక్షలు
కృష్ణ: 23 లక్షలు
నెల్లూరు: 15 లక్షలు
—————————————–
ఏపీ+తెలంగాణ= 4.29కోట్లు(6.70కోట్లు~ గ్రాస్)
—————————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 0.26 కోట్లు
ఓవర్సీస్- 0.30 కోట్లు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్ – 4.85కోట్లు(7.85కోట్లు~ గ్రాస్)
——————————————–
కాగా, బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 22.2 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. రూ. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలవాలంటే.. మొదటి రోజు వచ్చిన వసూళ్లు కాకుండా ఇంకా రూ. 18.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాలి.