సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర ఏప్రిల్ 7 అంటే నిన్న రిలీజ్ అయింది. ఇందులో రవితేజ, జయరామ్, సుశాంత్, మురళీ శర్మ, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ వంటి స్టార్ యాక్టర్స్ నటించారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ఖాయమని రవితేజతో సహా అభిమానులు అనుకున్నారు కానీ అది జరగలేదు. ఫస్ట్ డేనే ఈ మూవీపై నెగిటివ్ టాక్ వచ్చింది. కాగా ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డే ఓపెనింగ్స్ పర్లేదు అనిపించాయి.
ట్రేడ్ వర్గాల ప్రకారం, రావణాసుర మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7న ఏడు కోట్ల గ్రాస్‌ను, మూడు కోట్ల ఎనభై లక్షలకు పైగా షేర్‌ను రాబట్టింది. అయితే గతంలో విడుదలైన రవితేజ సినిమా ‘ధమాకా’ ఫస్ట్ రోజే రూ.10 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. రావణాసుర మాత్రం ఆ స్థాయిలో డబ్బులు వసూలు చేయలేకపోయింది. ఇది రొటీన్ డ్రామా అని, కొత్తగా చూపించడానికి సినిమాలో ఏమీ లేదని టాక్ బయటకు రావడంతో థియేటర్ల వైపు ఎవరూ చూడటం లేదు. అయితే ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకున్నా రవితేజ ఈ రెస్పాన్స్, ఫస్ట్ డే కలెక్షన్లను చూసి బాగా డిసప్పాయింట్ అవుతున్నారని సమాచారం.
ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఫ్యామిలీకి జరిగిన అన్యాయాన్ని చూస్తూ ఉండలేక ఒక యువకుడు ఎలా రివేంజ్ తీర్చుకున్నాడో చెప్పడమే ఈ మూవీ సారాంశం. ఇది చాలా రొటీన్ కథ అని కొందరు కామెంట్స్ చేస్తుండగా నెగిటివ్ పాత్రలో చేసిన రవితేజ పర్ఫామెన్స్ మాత్రం చాలా బాగుందని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. అలానే రవితేజ యాక్టింగ్, కామెడీ టైమింగ్ సూపర్ అని పొగుడుతున్నారు.