టాలీవుడ్ కింగ్ నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని.. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా హీరోగా నిలదొక్కుకునేందుకు ఇంకా కష్టపడుతూనే ఉన్నాయి. ఇకపోతే అఖిల్ బర్త్‌డే నేడు. దీంతో ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
అలాగే అఖిల్ తాజాగా చిత్రం `ఏజెంట్` మూవీ నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఈ నెల 28న ఏజెంట్ విడుదల కాబోతోందని ప్రకటిస్తూ అఖిల్ కు మేకర్స్ బర్త్‌డే విషెస్ తెలిపారు. అయితే అఖిల్ బర్త్‌డే సందర్భంగా లవ్లీ విషెస్ తో సర్‌ప్రైజ్ చేసింది సమంత. సోషల్ మీడియా ద్వారా అఖిల్ ను విష్ చేయడంతో పాటు అతడి లేటెస్ట్ మూవీ ఏజెంట్ రిలీజ్ డేట్ పోస్టర్ షేర్ చేసింది. పనిలో పనిగా అఖిల్ సినిమాకు పబ్లిసిటీ కల్పించింది.
అయితే సమంత నుంచి అఖిల్ కు బర్త్‌డే విషెస్ వస్తాయని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే కొద్ది నెలల క్రితమే అఖిల్ అన్న నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. దీంతో అక్కినేని కుటుంబంతో ఆమెకు తెగదెంపులు అయిపోయాయని అందరూ భావించారు. కానీ, చైతుతో విడిపోయినా అక్కినేని కుటుంబసభ్యులతో సమంత తన బంధాన్ని కొనసాగిస్తుందని తాజా పోస్ట్ తో తేలిపోయింది. ఈ విషయం పట్ల నెటిజన్లను ఆమెను అభినందిస్తున్నారు.