బన్నీ బర్త డే స్పెషల్: పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ.. దీనమ్మ ముట్టుకుంటే మటాష్ అయిపోవాల్సిందే..!!

ప్రజెంట్ వెబ్ మీడియాలో ..సోషల్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. ఈరోజు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు . దీంతో సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ అభిమానులు నానా హంగామా చేస్తున్నారు . మరీ ముఖ్యంగా నిన్న రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్ ని యమ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు .

కాగా అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా పుష్ప సినిమా 17 డిసెంబర్ 2021 ని రిలీజ్ అయి బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టింది . తనదైన స్టైల్ లో నటించి సినిమాకి హ్యూజ్ పబ్లిసిటీ చేసుకున్న బన్నీ .. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్నారు బనీ. బన్నీ బర్త డే సందర్భంగా సుకుమార్ .. ఆయన అభిమానులకి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు .

సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సెకండ్ ఎంతో సస్పెన్స్ గా కొనసాగిన ఈ త్రిల్లర్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది . అల్లు అర్జున్ బర్త డే సందర్భంగా ఆయన సినిమాలోని డైలాగులు ట్రెండ్ చేస్తున్నారు . పుష్ప సినిమాలోని డైలాగ్ ను సోషల్ మీడియా వేదికగా టాప్ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు బన్నీ అభిమానులు . పుష్ప సినిమాలోని “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా..ఫైరూ..ముట్టుకుంటే మటాష్ అయిపోవాల్సిందే” అంటూ ఘాటుగా బోల్డ్ పదాలు వాడి ట్రెండ్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది..!!