ఇప్పటికీ మిస్టరీగానే మారిన దివ్యభారతి మరణం.. ఎలా చనిపోయిందంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటించిన అతి తక్కువ సినిమాలతో యమ క్రేజీ సంపాదించుకున్న హీరోయిన్ దివ్యభారతి. ఈమె స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఈమె అనుకోకుండా 1993 ఏప్రిల్ 5వ తేదీన మృతి చెందింది. ఈమె మృతితో అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దివ్యభారతి మృతి చెంది ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతున్న ఈమె మరణం వెనుక గల కారణాలను మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉన్నాయి.

Was Divya Bharti pregnant when she died? - Quora
దివ్యభారతి మరణానికి కొన్ని గంటల ముందు చెన్నైలో సినిమా షూటింగ్ ముగించుకొని ముంబైకి చేరుకుందట.. అక్కడే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీత లుల్లా దివ్యభారతి భర్త శ్యామ్ దివ్యభారతి నటించబోయే ఆందోలన్ సినిమా పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్ డిజైనర్ గురించి మాట్లాడుతున్నారట. ఆ సమయంలో బాల్కనీ పిట్టగోడ మీద నుంచి దివ్యభారతి కిందికి జారి పడడంతో మృతి చెందిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె మరణం పైన పలు రూమర్లు కూడా వినిపించాయి.. దివ్యభారతి మద్యం సేవించి గోడమీద కూర్చొని ఉండగా కాలు జారి కిందికి పడిందని వార్తలు కూడా వినిపించాయి.

ఈమె గాయాలతో మృత్యువుతో పోరాటం చేసి దివ్యభారతి అయిదు అంతస్తు నుంచి కిందకు పడి మరణించిందని వార్త ఇప్పటికి వినిపిస్తున్నాయి.. అలా గాయాలతో ఈమెను ఆసుపత్రికి తరలించే లోగా అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని కథలు వచ్చాయి. కానీ దివ్యభారతి తండ్రి మాత్రం ఈమె మృతి పైన వస్తున్న వార్తలను ఖండించారు. సూసైడ్ మర్డర్ అంటూ వస్తున్న ఆరోపణలను ఖండించడం జరిగింది.. ఆమె కేవలం డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకుందని మీడియాలో వార్తలు వచ్చాయి.. కేవలం తన కూతురు బాల్కనీ గోడమీద కూర్చొని జారి పడిపోయిందని ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని క్లారిటీ ఇచ్చారు.