లోకేష్‌తో అనంతలో టీడీపీకి జోష్..ఆ సీట్లలో కలిసొస్తుందా?

నారా లోకేష్ పాదయాత్రకు నిదానంగా క్రేజ్ పెరుగుతుంది. వాస్తవానికి పాదయాత్ర మొదలైనప్పుడు పెద్దగా జనం పట్టించుకోలేదు. ఇక ఏదో ఆయన పాదయాత్ర అలా అలా సాగుతుందిలే అని అనుకున్నారు. మొదలైంది కుప్పం కాబట్టి అక్కడ కాస్త ఊపు కనిపించింది గాని..తర్వాత అంత ప్రభావం కనబడలేదు. కానీ పలమనేరు, పీలేరు లాంటి నియోజకవర్గాల్లో పాదయాత్ర మరో ఎత్తుకు వెళ్లింది. అక్కడ నుంచి పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరుగుతూ వచ్చింది.

ఇక లోకేష్ ప్రజలతో కలిసిపోయే విధానం నచ్చింది. అన్నీ వర్గాలతో ఆయన కలిసి వెళుతున్నారు. ఏ వర్గానికి ఆ వర్గంతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా యువతతో ఎక్కువ భేటీ అవుతున్నారు. దీని వల్ల పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఇంతకాలం యువత కాస్త టి‌డి‌పికి దూరంగా ఉన్నారు. ఈ పాదయాత్రతో యువత సైతం టి‌డి‌పి వైపు చూసేలా ఉన్నారు.

ఇక లోకేష్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో కూడా విజయవంతంగా సాగుతుంది. కదిరి, పుట్టపర్తి, పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, అనంత అర్బన్, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో సరికొత్త ఊపు  వచ్చింది.  నిజానికి రాప్తాడు, ధర్మవరం లాంటి స్థానాల్లో మొన్నటివరకు టి‌డి‌పి వెనుకబడింది. కానీ లోకేష్ పాదయాత్ర తర్వాత పరిస్తితి మారింది. పార్టీకి మైలేజ్ పెరిగింది. టి‌డి‌పికి ప్రజా మద్దతు పెరుగుతూ వస్తుంది. దీంతో ఆయా స్థానాల్లో టి‌డి‌పికి గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయి.

ఇంకా జిల్లాలో లోకేష్ పాదయాత్ర పలు స్థానాల్లో కొనసాగనుంది. ఇక ఎక్కడకక్కడ పాదయాత్రని విజయవంతం చేయాలని టి‌డి‌పి లీడర్లు రెడీ అవుతున్నారు. మొత్తానికైతే అనంతలో లోకేష్ పాదయాత్ర వల్ల టి‌డి‌పిలో జోష్ పెరిగింది.