HBD: అఖిల్ బర్తడే సందర్భంగా అదిరిపోయే అప్డేట్..!!

అక్కినేని అఖిల్ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతొంది.. తాజాగా నటిస్తున్న ఏజెంట్ సినిమా ఈనెల చివరిలో విడుదలకు సిద్ధమయ్యింది.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ తో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ చాలా స్టైలిష్ గా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా కనిపించబోతున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Agent Ultra-stylish Poster Unveiled On Akhil Birthday | cinejosh.com

ఈరోజు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా.. ఏజెంట్ సినిమా నుంచి ఫైరింగ్ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది.. చేతిలో గన్ పట్టుకొని అఖిల్ డాషింగ్ లుక్ లో కనిపించగా వెనక ఫైర్ బ్యాక్ డ్రాప్ అదిరిపోయారా కనిపిస్తోంది. ఒక విధంగా ఫ్యాన్స్ కి ఇది ఒక సూపర్ ట్వీట్ అని చెప్పవచ్చు. ఏజెంట్ సినిమా అఖిల్ కెరియర్ లోనే బెస్ట్ సినిమాగా అవుతుందని చిత్ర బృందం ధీమాతో ఉన్నారు. అఖిల్ ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తున్నది.

AK Entertainments on Twitter: "AGENT SUMA x AGENT AKHIL😎 Kick-starting the  #AGENT Release Campaign with the Birthday Special Interview of our  @AkhilAkkineni8 with @ItsSumaKanakala ❤️‍🔥 Stay Tuned ⏳ #AgentOnApril28th  @mammukka @sakshivaidya99 ...
సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత సురేందర్ రెడ్డి మరొకసారి తన సత్తా చాటేల ఏజెంట్ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏజెంట్ సినిమా బిజినెస్ విషయంలో కూడా కాస్త దూకుడు చూపిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్ శాటిలైట్ రైట్స్ భారీ దడుకు అమ్ముడుపోయినట్లు సమాచారం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత అఖిల్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడింది. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది.