ఢిల్లీలో పవన్..మొన్న జగన్..కమలం ఎత్తులు!

ఏపీ రాజకీయాల్లో బీజేపీకి ఏ మాత్రం బలం లేకపోయినా..ఆ రాజకీయాలని అటు మార్చడంలో మాత్రం బి‌జే‌పికి ఆడే గేమ్ వేరుగా ఉందని చెప్పవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఏపీ రాజకీయాలని బి‌జే‌పి ప్రభావితం చేస్తుంది. పైగా రాష్ట్రంలో అన్నీ పార్టీలు బి‌జే‌పి చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ, టి‌డి‌పి, జనసేన ఇలా ప్రధాన పార్టీలు బి‌జే‌పిని ప్రసన్నం చేసుకోవడానికి చూస్తున్నాయి.

ఇదే అడ్వాంటేజ్ గా బి‌జే‌పి..రాష్ట్ర రాజకీయాలతో ఆడేసుకుంటూ..తమకు కావల్సిన విధంగ రాజకీయం నడిపించుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ నేతలతో కర్ణాటక రాజకీయాలన్ ప్రభావితం చేయాలని చూస్తున్నారు. కర్ణాటకలో ఏపీ నేతల ప్రభావం కొంతవరకు ఉందనే అందుకే ఇటీవల జగన్‌ని ఢిల్లీకి పిలిపించుకున్నారని టాక్ వస్తుంది. ఒక నెలలోనే జగన్ రెండు సార్లు ఢిల్లీకి వెళ్లారు. అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అక్కడ బి‌జే‌పి గెలిచేలా జగన్ సహకరించే విధంగ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఆర్ధికంగా కూడా జగన్..కర్ణాటకలో బి‌జే‌పికి సహకరిస్తారని ప్రచారం వస్తుంది.

ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ సైతం తాజాగా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బి‌జే‌పి పెద్దలతో వరుసగా భేటీ కానున్నారు. అయితే ఆయన ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో క్లారిటీ లేదు. ఆయన వెళ్ళారా? లేక బి‌జే‌పి పెద్దలు పిలిచారా? అనేది తెలియదు. అలాగే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పిలిచారా? లేదంటే కర్ణాటక ఎన్నికల్లో పవన్ చేత బి‌జే‌పికి ప్రచారం చేసేలా ప్లాన్ చేశారనేది తెలియడం లేదు.

ఎక్కువ శాతం పవన్ చేత కర్నాటకలో ప్రచారం చేయించడానికే బి‌జే‌పి పెద్దలు పిలిచారనే టాక్ వస్తుంది. ఎందుకంటే అక్కడ పవన్‌కు అభిమానులు బాగానే ఉన్నారు..దీంతో ఆయనని ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలని బి‌జే‌పి చూస్తుందని తెలిసింది. అటు జగన్, ఇటు పవన్‌లని వాడుకుని కర్ణాటక ఎన్నికల్లో లబ్ది పొందాలనేది బి‌జే‌పి ప్లాన్ అని తెలుస్తోంది.