భూమా ఫ్యామిలీ సీట్లలో కన్ఫ్యూజన్..బాబు ప్లాన్ ఏంటి?

ఎన్నికలకు ముందే సీట్లు ఖరారు చేసేయాలనే ప్లాన్ లో చంద్రబాబు ఉన్నారు. గతంలో మాదిరిగా ఎన్నికల సమయంలో సీట్లు ఫిక్స్ చేయకుండా ఈ సారి ముందే సీట్లు ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది అభ్యర్డులని ఖరారు చేసేశారు. ఇక నెక్స్ట్ వారే పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చేశారు. ఇదే క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా బాబు సీట్లు ఫిక్స్ చేస్తున్నారు. అక్కడ కొంతమంది అభ్యర్ధులకు దాదాపు క్లారిటీ ఇచ్చేశారు.

ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో కొంతవరకు తేలింది. బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి, డోన్ లో సుబ్బారెడ్డి, కోడుమూరులో ప్రభాకర్, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి, పాణ్యంలో చరితా రెడ్డి, కర్నూలు సిటీలో టీజీ భరత్, మంత్రాలయంలో తిక్కారెడ్డి, ఆదోనిలో మీనాక్షి నాయుడు, ఎమ్మిగనూరులో జయనాగేశ్వర్ రెడ్డి, పత్తికొండలో కే‌ఈ శ్యామ్, ఆలూరులో కోట్ల సుజాతమ్మ పోటీ చేయడం దాదాపు ఖాయమనే చెప్పాలి. ఇక నందికొట్కూరు సీటులో ఇంకా క్లారిటీ లేదు.

ఇక కీలకమైన ఆళ్లగడ్డ, నంద్యాల స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనేది క్లారిటీ రావాలి. ప్రస్తుతం ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ఇంచార్జ్ గా ఉండగా, నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి ఇంచార్జ్ గా ఉన్నారు. అయితే ఈ సీట్లలో టి‌డి‌పి వెనుకబడింది. ఇంకా పికప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే ఏదొక సీటులో మార్పు చేయాలని బాబు చూస్తున్నారని తెలిసింది. భూమా ఫ్యామిలీ నుంచే మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అఖిలప్రియ సొంత తమ్ముడు విఖ్యాత్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా లేక భూమా కిషోర్ రెడ్డికి అవకాశం ఇస్తారా? అనేది చూడాలి.