టెక్కలి వైసీపీ అభ్యర్ధి ఫిక్స్..అచ్చెన్నని ఓడించగలరా?

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అంటే టి‌డి‌పికి ఒక్క సీటు కూడా దక్కకూడదని లక్ష్యంగా పెట్టుకున్నారు. అసలు గత ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచిన సీట్లని కూడా ఇప్పుడు దక్కనివ్వకూడదని జగన్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు దగ్గర నుంచి..ప్రతి టి‌డి‌పి నాయకుడుని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇదే క్రమంలో ఏపీ టి‌డి‌పి అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని సైతం టార్గెట్ చేశారు. ఆయన సొంత స్థానం టెక్కలిలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు.

ఈ క్రమంలోనే అక్కడ వైసీపీ అభ్యర్ధిగా దువ్వాడ శ్రీనివాస్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాకుళం పర్యటనకు వెళ్ళిన ఆయన..దువ్వాడని అభ్యర్ధిగా బరిలో దింపుతున్నట్లు ప్రకటించారు. ఇక అచ్చెన్నాయుడుపై దువ్వాడ శ్రీనివాస్ అనే మొగుడుని దింపుతున్నామని మంత్రి అప్పలరాజు చెప్పుకొచ్చారు. అంటే అచ్చెన్నని ఓడిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. మరి టెక్కలిలో అలాంటి పరిస్తితులు ఉన్నాయా? అంటే ప్రస్తుతానికి మాత్రం లేవనే చెప్పాలి. టెక్కలిలో ఇప్పటికీ అచ్చెన్న బలంగా ఉన్నారు.

గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా గెలిచిన అచ్చెన్నని నిలువరించడానికి జగన్ చేయని ప్రయత్నాలు లేవు. ఇక ఆయనని ఓ కేసులో అరెస్ట్ కూడా చేశారు. అలా అరెస్ట్ చేయడమే అచ్చెన్నపై సానుభూతి పెరిగేలా చేసింది. ఇక తర్వాత శ్రీకాకుళం పార్లమెంట్ లో ఓడిపోయిన దువ్వాడని తీసుకొచ్చి టెక్కలి ఇంచార్జ్ గా పెట్టారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు టెక్కలి సీటు కూడా ఇచ్చారు.

అయితే అక్కడ దువ్వాడకు అనుకూలమైన పరిస్తితులు ఏమి లేవు. పైగా సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఇక అధికార బలాన్ని వాడుకుని దువ్వాడ చేసిన కార్యక్రమాలు..ఆయనకే రివర్స్ అయ్యాయి. మొత్తానికైతే టెక్కలిలో అచ్చెన్నని ఓడించడం ఈజీ కాదనే చెప్పాలి.