బ్రహ్మానందం ఆ స్టార్ కమెడియన్ గొడవకి .. చిరంజీవికి సంబ‌దం ఎంటి..?

సినిమా రంగంలో ఉన్న వారి మధ్య ఇగోలు, పంతాలు, గొడవలు, పట్టింపులు చాలా మామూలుగా జరుగుతూ ఉంటాయి. కొందరు కొన్ని నెలలు కొన్ని, రోజులు కొన్ని, సంవత్సరాలపాటు ప్రాంతాలకు పోయి మాట్లాడుకోకుండా ఉంటారు. ఆ తర్వాత వారే వారి అవసరాల కోసం కలిసిపోతూ ఉంటారు. ఈ రోజు స్నేహితులుగా ఉన్నవాళ్లు రేపు శత్రువులుగా ఉంటారు. ఈరోజు శత్రువులుగా ఉన్నవాళ్లు రేపు స్నేహితులు అయిపోతారు.

మనల్ని చిన్నప్పుడు బాగా నవ్వించిన ఈ 10 కమెడియన్స్...ఇటీవల కాలంలో మనకి దూరమై  కంటతడి పెట్టించారు.!

వృత్తిపరమైన పోటీ నేపథ్యంలోనే ఇక్కడ ఎక్కువగా మాట పట్టింపులు.. పంతాలకు పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందంకు దివంగత స్టార్ కమెడియన్ ఏవీఎస్ కు మధ్య ఒకానొక సందర్భంలో భేదాభిప్రాయాలకు వచ్చి చివరకు వారు మాట్లాడుకొని పరిస్థితి వచ్చేసిందట.

Comedy Kings - Brahmanandam And A.V.S Hilarious Comedy - Brahmanandam,A.V.S  - video Dailymotion

ఈ గొడవ జరిగినప్పుడు బ్రహ్మానందం, ఏవీఎస్, సుధాకర్ ముగ్గురూ స్టార్ కమెడియన్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆ సమయంలోనే కొన్ని సినిమాల్లో పాత్రలో దక్కించుకునే నేపథ్యంలో బ్రహ్మానందం కు ఏవిఎస్ కు మధ్య భేదాభిప్రాయాలు వచ్చి వారు మాట్లాడుకొని పరిస్థితి వచ్చిందట. ఆ సమయంలో ఇండస్ట్రీలో మిగిలిన కమెడియన్లు అందర్నీ ఒకే తాటి మీదకు తీసుకువచ్చి ఏవీఎస్ తన ఆధ్వర్యంలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశాడట.

Brahmi reveals the real reason for his downfall in Tollywood

ఈ సమావేశాన్ని కేవలం బ్రహ్మానందంకు వ్యతిరేకంగా ఆయన ఆధిపత్య పోకడలను ప్రశ్నించేందుకే ఏవీఎస్ ఏర్పాటు చేశారన్న గుసగుసలు అప్పట్లో ఉన్నాయి. దాదాపు 20 మంది కమెడియన్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే బ్రహ్మానందంతో సఖ్యతతో ఉండే కమెడియన్లు మాత్రం ఏవీఎస్‌ను ఆహ్వానించలేదట. ఈ విషయం తెలిసిన బ్రహ్మానందం సైలెంట్ గానే ఉన్నారు.

What is Chiranjeevi's Net Worth In 2022?

అయితే మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకొని మీరంతా ఒకటే కుటుంబానికి చెందినవారు. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. తర్వాత ఒకే సినిమా షూటింగ్లో కలిసి పనిచేయాల్సిన వారు మీ మధ్య గొడవలు ఎందుకని… ఆయన మధ్యవర్తిత్వం వహించి వీరి మధ్య ఉన్న గొడవలను పరిష్కరించారట. ఆ తర్వాత మళ్లీ వారంతా ఒక్కటే అయిపోయారు.