నటనలో రజనీకాంత్‌ని అనుకరిస్తానంటూ సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరో..

ప్రముఖ తమిళ నటుడు గౌతమ్ కార్తీక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గౌతమ్ కార్తీక్ హీరో గా నటించిన సినిమా ఆగస్టు 16, 1947. ఈ సినిమా ద్వార నటి రేవతి హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ఏఆర్‌ మురుగదాస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఓం ప్రకాష్‌ బట్‌, నర్శీరామ్‌ చౌదరితో కలిసి దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ నిర్మించిన సినిమా ఇది. ఎన్ ఎస్ పొన్ కుమార్ ఆగెస్ట్ 16, 1947 సినిమా కి దర్శకత్వం వహించారు. శ్యాన్ రోల్డర్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

ఇక ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్‌లో సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో శివకార్తికేయన్‌ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ తనకు సీనియర్‌ నటుడు కార్తీక్‌ అంటే చాలా ఇష్టం అని, ఆయన చాలా స్వీటెస్ట్‌ పర్సన్‌ అని పేర్కొన్నారు. గౌతమ్‌ కార్తీక్‌ను కలిసిన చాలా కాలం తర్వాత తాను కార్తీక్‌ను కలిశానని, ఆయన చాలా అందగాడని శివకార్తికేయన్ అన్నారు అయితే తన నటనలో రజనీకాంత్‌ చాయలు ఉంటాయని శివ కార్తికేయన్‌ పేర్కొన్నారు. కాగా తన పయనం దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌తో ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌ చిత్రంతోనే మొదలైంది అన్నారు. అది ఏఆర్‌ మురుగదాస్‌కు నిర్మాతగా తొలి చిత్రమని తెలిపారు.

ఆ చిత్ర ప్రారంభోత్సవానికి తాను వ్యాఖ్యాతగా వ్యవహరించానన్నారు. ఆ తర్వాత ఆయన నిర్మించిన మాన్‌ కరాటే చిత్రంలో తాను కథానాయకుడిగా నటించానని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన నిర్మించిన ఈ చిత్రానికి తాను అతిథిగా విచ్చేశానని అదే విధంగా త్వరలో మరో ఇంపార్టెంట్‌ స్టెప్పును వేయబోతున్నట్లు చెప్పారు. అది త్వరలోనే జరుగుతుందని అన్నారు. కాగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ హీరోగా ఓ భారీ చిత్రం తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.