పొట్టి బట్టలలో అందాల డోస్ పెంచేసిన బిగ్‌బాస్ ఫేమ్ దివి.. పిక్స్ వైరల్!

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెద్ద పెద్ద కళ్ళతో, అదిరిపోయే అందంతో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తూ ఉంటుంది. ఈ మత్తేక్కించే బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాములుగా లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె ఒక్క ఫోటో పెడితే చాలు వేల సంఖ్యలో లైకులు, కామెంట్స్ వస్తుంటాయి. అలా సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్‌ని సంపాదించుకోవడం వల్లే ఈ అమ్మడు బిగ్ బాస్ ఆఫర్ ని దక్కించుకుంది.

అప్పటివరకు సోషల్ మీడియాకే పరిమితం అయిన ఈ అమ్మడు బిగ్ బాస్ షో ద్వారా కోట్లాది ప్రజలకు దగ్గరైంది. బిగ్ బాస్ తరువాత సినిమాలలో మంచి మంచి అవకాశాలు దక్కించుకున్న కంటెస్టెంట్ దివి ఒక్కరే. అంతేకాకుండా గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్ర పోషించింది ఈ బ్యూటీ. దివి బీబీ హౌస్ నుండి బయటికి వచ్చాక బీబీ గ్రాండ్ ఫినాలేకి హాజరైన చిరు తన సినిమాలో అవకాశం ఇస్తా అని మాటిచ్చాడు. అవకాశం అంటే ఏదో చిన్న పాత్ర అని అంతా అనుకున్నారు , కానీ కథని మలుపు తిప్పే ముఖ్యమైన పాత్ర ఇస్తారని ఎవరూ ఊహించలేదు.

గాడ్ ఫాదర్ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఈ భామకి ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి. వరుస అవకాశాలు వస్తున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు గ్లామర్ ట్రీట్ ఏమాత్రం తగ్గడం లేదు. అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూనే ఉంది. అలానే ఈరోజు కూడా కొన్ని హాట్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం దివి హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.