నెల్లూరులో టీడీపీకి ఊపు..ఆధిక్యం వస్తుందా?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ పార్టీకి పెద్ద బలం లేదు..గత నాలుగు ఎన్నికల నుంచి మంచి ఫలితాలు సాధించలేదు. 2014 ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకోగా, వైసీపీ 7 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అంటే టి‌డి‌పికి ఒక్క సీటు కూడా దక్కలేదు.

అలాంటి పరిస్తితులని నుంచి టి‌డి‌పి ఇప్పుడు పుంజుకుంటుంది. నెల్లూరులో పలు స్థానాల్లో ఆధిక్యంలోకి వస్తుంది. పైగా ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు టి‌డి‌పి వైపుకు రావడం ఖాయమైంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..వీరు ముగ్గురు వైసీపీకి దూరమయ్యారు. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి ఓటు వేసినట్లు తెలిసింది. దీంతో వీరిపై వైసీపీ వేటు వేసింది..పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంతో వారు రిలాక్స్ అయ్యారు. పార్టీ సస్పెండ్ చేయడం మంచిదే అని చెప్పుకొస్తున్నారు.

ఇక వీరు టి‌డి‌పి వైపుకు వస్తే..నెల్లూరులో పార్టీ బలపడుతుంది. ఇటీవల సర్వేల్లో కూడా నెల్లూరులో టి‌డి‌పికి ఆధిక్యం ఉన్నట్లు తేలింది. జిల్లాలో 10 సీట్లు ఉంటే టి‌డి‌పి..నెల్లూరు సిటీ, రూరల్, కావలి, ఉదయగిరి, వెంకటగిరి సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తేలింది. వైసీపీ వచ్చి సర్వేపల్లి, ఆత్మకూరు సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని తేలింది.

ఇక గూడూరు, సూళ్ళూరుపేట, కోవూరులో రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది. మొత్తానికైతే నెల్లూరులో టి‌డి‌పి బలపడుతుందనే చెప్పాలి.