టీడీపీకి టచ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు..ఎంతమంది?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7 స్థానాలని కైవసం చేసుకోవాలని మంత్రులకు జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే పూర్తి మెజారిటీ ఉంటే జగన్ ఇంత సీరియస్ గా తీసుకునేవారు కాదనే చెప్పాలి..కానీ మెజారిటీ లేకపోవడం వల్లే ఈ పరిస్తితి వచ్చిందని తెలుస్తోంది. వైసీపీ 6 స్థానాలని సులువుగానే గెలుచుకుంటుంది. కానీ 7వ స్థానం కోసం టి‌డి‌పితో పోటీ పడాల్సి ఉంది.

నిజానికి టి‌డి‌పి పోటీలో ఉండకపోతే ఏకగ్రీవం అయ్యేది..కానీ అనూహ్యంగా టి‌డి‌పి తరుపున పంచుమర్తి అనురాధ బరిలో దిగారు. ఒక్కో ఎమ్మెల్సీ స్థానం కావాలంటే 23 ఎమ్మెల్యేలు కావాలి. అయితే టి‌డి‌పికి నెంబరు పరంగా 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ చేసిన విషయం తెలిసిందే. వారు టి‌డి‌పి గుర్తుపైనే గెలిచారు. కాబట్టి విప్ ఉంటుంది..ఆ విప్ గానే పట్టించుకోకపోతే వారిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో టీడీపీ నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు ఉంటే..వైసీపీలో ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇటీవలే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి వైసీపీకి దూరమైన విషయం తెలిసిందే. వీరు గాని టి‌డి‌పికి మద్ధతు ఇస్తే సీన్ మారుతుంది. వీరే కాదు..ఇంకా ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారని ప్రచారం నడుస్తోంది. వారు కూడా వైసీపీకి వ్యతిరేకంగా వెళితే ఎమ్మెల్సీని దక్కించుకోవడం కష్టమని తెలుస్తోంది.

అందుకే జగన్ మంత్రులకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా 7 ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలని చెప్పుకొచ్చారు. అయితే విప్ ఉంటుంది కాబట్టి..అటు టి‌డి‌పి రెబల్ ఎమ్మెల్యేలుకైనా, ఇటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కైనా రిస్క్ ఉంటుంది.