ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క రోజు సంపాద‌న ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!

సాధారణంగా సెలబ్రెటీలు త‌మ‌ రిమ్యునరేషన్ వివరాలను బయటకు చెప్పేందుకు ఒప్పుకోరు. కానీ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ పై ఓపెన్ కామెంట్స్ చేశారు. ఓవైపు రాజ‌కీయాలు, మ‌రోవైపు సినిమాలు అంటూ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రూ. 1,000 కోట్లు ఆఫర్‌ చేశారని కొందరు దుష్ప్రచారం చేశారని.. తానకు డబ్బులకు కొదవ లేదనీ. మరోసారి ఇలాంటి దుష్ప్రచారం చేస్తే చెప్పతో కొడతానని తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. త‌న‌కు ఒక్కో సినిమాకు రూ. 40 కోట్ల నుంచి రూ. 45 కోట్లు వస్తాయని ప‌వ‌న్ బ‌హిరంగంగా వెల్ల‌డించారు.

తాను ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా(వినోద‌య సీతాం రీమేక్‌)కు 22 రోజులే షూటింగ్ అన్నారు. రోజుకు రెండు కోట్లు తీసుకుంటానన్నారు. డబ్బులే తనకు కావాలంటే.. తాను సినిమాల ద్వారా సంపాదించుకుంటాన్నారు. అలాంటిది తనకు డబ్బులు వేరే వాళ్లు ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు. మొత్తానికి త‌న ఒక్క రోజు సంపాద‌న రెండు కోట్ల రూపాయిలు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌హిరంగంగా బ‌య‌ట‌పెట్టి అంద‌రికీ దిమ్మ తిరిగేలా చేశాడు. దీంతో ఆయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.