`బింబిసార` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన తాజా చిత్రం `అమిగోస్`. నేడు అట్టహాసంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజేంద్రరెడ్డి ఈ మూవీతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. జిబ్రాన్ సంగీతం అందించాడు. ఇప్పటికే పలు చోట్ల ప్రీవ్యూస్ పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ప్రపంచంలో ఒకరిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే నానుడి ఉంది. అమిగోస్ మూవీలో హీరో తమలా ఉండే వ్యక్తులను కలిసే సాఫ్ట్ వేర్ ని డెవలప్ చేస్తాడు. ఈ క్రమంలో తాను తనలా ఉన్న మరో ఇద్దరిని కలుస్తాడు. అసలు ఆ ఇద్దరు ఎవరు? వారి నేపధ్యాలు ఏమిటీ? ఆ ఇద్దరిని కలిసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అన్నది కథ. కాన్సెప్ట్ కొత్తగా ఉందని, కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో వైవిధ్యం చూపిస్తూ అదరగొట్టేశాడని ప్రేక్షకుల ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. కళ్యాణ్ రామ్ ఎనర్జిటిక్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
ఆషికా రంగనాథ్ గ్లామర్, యాక్షన్ సన్నివేశాలు చెప్పుకోదగ్గ అంశాలు. సెకండ్ హాఫ్ లో వచ్చే బాలయ్య రీమిక్స్ సాంగ్ `ఎన్నో రాత్రులొచ్చాయి కానీ` సినిమాకు వన్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచిందని అంటున్నారు. నిర్మాణ విలువలు, బ్రహ్మాజీ కామెడీ వంక పెట్టాల్సిన పని లేదు. కానీ, మంచి కాన్సెప్ట్ ఎంచుకున్న డైరెక్టర్ దాన్ని ప్రభావవంతంగా తెరకెక్కించడంలో విఫలం అయ్యాడని అంటున్నారు. జిబ్రాన్ బీజీఎమ్ కి పెట్టింది పేరు. అయితే అమిగోస్ విషయంలో ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యాడని చెబుతున్నారు. బలహీనమైన స్క్రీన్ ప్లే, ఆసక్తి లేని సన్నివేశాలు, బీజీఎమ్ సినిమాకు పెద్ద మూనస్‌లు అని టాక్ నడుస్తోంది. ఏదేమైనప్పికీ అమిగోస్ చిత్రానికి డీసెంట్ టాక్ అందుతుంది. కళ్యాణ్ రామ్ కు మరో హిట్ ఖాయమని అభిమానులు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.