ఈ ముగ్గురి దిగ్గజాల మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ ఏంటో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు ఊహించిన విధంగా వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సరం చివరిలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నటులు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ వంటి వారు మరణించగా అప్పటినుంచి ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి చివరలో తెలుగు అగ్ర నటి జమున ఈ లోకాన్ని విడిచి వెళ్ళగా, ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో మరో దిగ్గజం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

Kaikala Satyanarayana: తన ఊరంటే కైకాలకు ఎంతో ప్రేమ.. కౌతవరంలో విషాదఛాయలు -  NTV Telugu

తెలుగు పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు కళాతపస్వి గాపేరు తెచ్చుకున్న కే. విశ్వనాథ్ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. అయ‌న మృతి ప‌ట్ల చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్బ్రాంతి గురి చేసింది. దాదాపు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఐదు ద‌శాబ్దాల పాటు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఆయ‌న త‌న సినిమాల‌తో కొత్త పుంత‌లు తొక్కించారు. ఆయ‌న కేరీర్‌లో 53కు పైగా అద్భుత‌మైన సినిమాల‌ను తెలుగు తెర‌కు అందించారు విశ్వనాథ్‌.

త‌న సినిమాలో సాంప్ర‌దాయ శాస్త్రీయ సంగీతానికి పెద్ద పీట వేస్తు, సాంప్రదాయాల చాటున సాగే మూఢ విశ్వాసాలను బట్టబయలు చేశారు విశ్వనాథ్‌. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్ద లోటు.
ఇదిలా ఉంటే మూడు సంవత్సరాల క్రితం గాన గాంథర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించారు. ఇప్పుడు కె. విశ్వనాథ్ కి, బాలసుబ్రమణ్యం కుటుంబానికి రిలేషన్స్ ఉన్నాయట.

K Viswanath | Chaitanya Kumar Vummethala's Blog

అలాగే సీనియర్ నటుడు చంద్రమోహన్ ఫ్యామిలీతో కూడా వీరికి రిలేషన్స్ ఉన్నాయి. మరి ఈ ముగ్గురు దిగ్గజతారలు మూడు విభాగాల్లో అగ్ర తారలుగా ఎదిగిన వీరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు వివరాల్లోకి వెళితే. సీనియర్ నటుడు చంద్రమోహన్ పెదనాన్న రెండో భార్య కొడుకు కే విశ్వనాథ్. చంద్రమోహన్ తల్లి, కె విశ్వనాథ్ తండ్రి మొదటి భార్య వీరిద్దరూ అక్కాచెల్లెళ్లు. అలా వీరిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉంది.

Senior Actor Chandra Mohan About His Bonding With Director K Vishwanath |  Manastars - YouTube

అలాగే చంద్రమోహన్ బావమరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. అలా వీరి మధ్య కూడా అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. ఇలా ఈ ముగ్గురికి వారి కుటుంబాల పరంగా మంచి అనుబంధం ఉంది. ముగ్గురు వరసకు అన్నదమ్ములు కావడం మరో విశేషం. ఈ విషయాన్ని వారు సినిమాల్లోకి వచ్చిన బయటికి రాకుండా మేనేజ్ చేస్తూ తమ రంగంలో రాణిస్తూ అగ్ర శిఖరాని అందుకున్నారు.

ఇదిలా ఉంటే కె విశ్వనాథ్‌ 1966లో `ఆత్మ గౌరవం` సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం కాగా, అదే ఏడాది `రంగులరాట్నం` సినిమాతో నటుడిగా చంద్రమోహన్‌ టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. ఏడాది తర్వాత `శ్రీ శ్రీ మర్యాద రామన్న` సినిమాతో సింగర్‌గా బాలు వెండితెరకి పరిచయం అయ్యాడు. ఇలా ఈ ముగ్గురూ తమ విభాగాల్లో ఉన్నతులుగా ఎదిగారు. వీరిలో ఇద్దరు ఈ లోకాలను విడిచి వెళ్లిపోవడం విచారకరం. చంద్రమోహన్‌ వయసు రీత్యా సినిమాలు తగ్గించారు.