కర్నూలు వైసీపీలో రచ్చ..సీటు కోసం పోరు..!

అధికార వైసీపీలో ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. పలు నియోజకవర్గాల్లో పార్టీలో పోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు సరిగగా పొసగని పరిస్తితి. ఇక ఈ పరిస్తితి కంచుకోట కర్నూలు జిల్లాలో కూడా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో వైసీపీ 14కి 14 సీట్లని గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే నిదానంగా అక్కడ కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. కొన్ని చోట్ల సొంత పార్టీ వాళ్లే ఎమ్మెల్యేలని వ్యతిరేకించే పరిస్తితి ఉంది.

జిల్లాలో ఎక్కడకక్కడ సీటు కోసం రచ్చ నడుస్తోంది. ఎమ్మిగనూరు సీటు కోసం వైసీపీలో పోటీ నెలకొంది. ఇక్కడ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఉన్నారు..ఈయన వయోభారంతో పోటీ చేయలేనని చెప్పేశారు..ఇక తన వారసుడుకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. చెన్నకేశవ సైడ్ అవుతుండటంతో ఎమ్మిగనూరు సీటు కోసం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన వారసుడు కోసం ట్రై చేస్తున్నారు. లేకపోతే తన అన్న కుమారుడుకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అటు వైసీపీ నేత రుద్రగౌడ్ సైతం ఎమ్మిగనూరుపై ఆశలు పెట్టుకున్నారు. ఇక మాజీ ఎంపీ బుట్టా రేణుకా కర్నూలు ఎంపీ లేదా ఎమ్మిగనూరు సీటు కోసం చూస్తున్నారు.

అటు కర్నూలు సిటీలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య సీటు ఫైట్ జరుగుతుంది. ఇక నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్..బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మధ్య పోరు నడుస్తోంది. నెక్స్ట్ ఆర్థర్‌కు కాకుండా…తన వర్గంలోని నేతకు సీటు ఇప్పించుకోవాలని బైరెడ్డి చూస్తున్నారు. అలాగే కోడుమూరులో ఎమ్మెల్యే సుధాకర్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్లే గళం వినిపిస్తున్నారు.

ఇక మంత్రులు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలపై సొంత నేతలే అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. ఇలా కర్నూలులో పెద్ద రచ్చ నడుస్తోంది.