టీడీపీ-జనసేనతో 77 ఫిక్స్..అధికారానికి ఆ సీట్లే మెయిన్!

రాష్ట్రంలో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైందనే చెప్పాలి..వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఫిక్స్ అయిందని ఇటీవల చంద్రబాబు-పవన్ భేటితో క్లారిటీ వచ్చేసింది. రెండు పార్టీలు కలిస్తే అధికార వైసీపీకి రిస్క్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది. అందుకే ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి బాబు-పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు.

అయితే రెండు పార్టీల పొత్తు ఉంటే సులువుగా అధికారంలోకి వస్తారనే అంచనా వస్తుంది. ఆ విషయం పక్కన పెడితే..గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో పడిన ఓట్లని ఒక్కసారి చూసుకుంటే..టీడీపీ-జనసేన కలిస్తే దాదాపు 75 సీట్లపైనే గెలిచేవి. సింగిల్ గా పోటీ చేసి టీడీపీ 23 సీట్లు, జనసేన 1 సీటు గెలుచుకుంది. అంటే టోటల్ 24 సీట్లు..ఇక జనసేన ప్రభావంతో ఓట్లు చీలిక జరిగి టీడీపీ దాదాపు 53 స్థానాల్లో ఓటమి పాలైంది.

ఈ స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. ఈ స్థానాల్లో టీడీపీ-జనసేన ఓట్లు కలిపితే వైసీపీకి పడిన ఓట్లు కంటే ఎక్కువే. అంటే ఆ స్థానాల్లో వైసీపీకి టీడీపీపై వచ్చిన మెజారిటీల కంటే జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. ఆ లెక్కన చూసుకుంటే టీడీపీ-జనసేన అప్పుడే కలిసి ఉంటే ఆ 53 స్థానాలని కూడా గెలుచుకునేవి. ఇక 24 ప్లస్ 53 అంటే 77 సీట్లు గెలుచుకునేవి.

అయితే గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఉంది..ఇప్పుడు అది కాస్త తగ్గుతుంది..జగన్ ఇమేజ్ కూడా కాస్త తగ్గుతుంది. దీని బట్టి చూస్తే 77 సీట్లకు మరో 11 సీట్లు గెలిస్తే మ్యాజిక్ ఫిగర్ 88 సాధించి టీడీపీ-జనసేన అధికారంలోకి రావచ్చు.