మైదుకూరు-రాజంపేటలపైనే టీడీపీ ఆశలు..!

ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు కనిపించడం లేదు. ఎలాగో జిల్లా వైసీపీకి కంచుకోట. ఇక్కడ వైఎస్సార్ అభిమానులు ఎక్కువ. రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితి ఉన్నా సరే ఇక్కడ మాత్రం వైసీపీకి అనుకూలంగానే ఉంటుంది. అందుకే గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ సత్తా చాటుతుంది. 2014 ఎన్నికల్లో 10 సీట్లలో వైసీపీ 9, టీడీపీ 1 సీటు గెలుచుకుంది.

2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే ఇప్పటికీ అక్కడ పెద్ద ఆధిక్యం మారలేదు. కాకపోతే కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటం..టీడీపీ నేతలు కాస్త బలపడటం వల్ల రెండు, మూడు నియోజకవర్గాల్లో టీడీపీకి కాస్త అనుకూల వాతావరణం ఏర్పడినట్లు తెలుస్తోంది. టీడీపీ సైతం ఇక్కడ ఎక్కువ స్థానాలపై ఆశలు పెట్టుకోలేదు. ఇక్కడ కనీసం ఒకటి లేదా రెండు సీట్లు గెలిచిన గొప్ప అని భావిస్తుంది. ప్రస్తుతం టీడీపీ రెండు సీట్లపైనే ఆశలు పెట్టుకుంది. జిల్లాలో 10 సీట్లు ఉంటే వాటిల్లో రాజంపేట, మైదుకూరు సీట్లపై టీడీపీకి ఆశలు ఉన్నాయి. వీటిని కైవసం చేసుకుంటే చాలు అని భావిస్తుంది.

ప్రస్తుతం పరిస్తితులు చూస్తే రెండు స్థానాల్లో టీడీపీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుందని..ఇటీవల టీడీపీ అంతర్గత సర్వేల్లో కూడా తేలిందట. మైదుకూరులో టీడీపీకి ఎక్కువ బలం కనిపిస్తుందట. అటు రాజంపేటలో కూడా స్ట్రాంగ్ గానే ఉంది. ఈ రెండు సీట్లని ఎలాగైనా గెలుచుకోవాలని చూస్తుంది.

కాకపోతే ఎన్నికల సమయానికి ఇంకా పరిస్తితి మారే ఛాన్స్ ఉందని, అలాగే జిల్లాలో కొందరు బడా నేతలు టీడీపీలోకి వస్తే కడపలో పట్టు సాధించవచ్చని టీడీపీ చూస్తుంది. మైదుకూరు, రాజంపేట మాత్రమే కాకుండా ప్రొద్దుటూరు, కమలాపురం, రైల్వే కోడూరులపై కూడా ఆశలు ఉన్నాయట. మరి చూడాలి కడపలో టీడీపీ ఏ మేర రాణిస్తుందో.