రాజ‌మౌళినా మాజాకా.. ఏకంగా మాజీ ప్రపంచ సుందరినే ప‌డేశాడు!

దర్శకధీరుడు రాజమౌళి అంటే తెలియని సినీ ప్రియుడు ఉండరు. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్‌ సంపాదించుకున్న రాజమౌళి `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యారు. ఈ మూవీ తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం రాజమౌళితో పని చేయాలంటూ ఓపెన్ గానే చెబుతున్నారు.

ఇక తాజాగా రాజమౌళి ఏకంగా మాజీ ప్రపంచ సుందరిని పడేశాడు. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాలని గెలుచుకున్న మానుషీ చిల్లర్ గురించి ప్రత్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2017 లో మిస్ వరల్డ్ గా ఎన్నికై ఇండియాకి ప్రపంచ సుందరి కిరీటాన్ని తీసుకొచ్చిన ఈ అందాల సోయ‌గం.. 2022 లో అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో బాలీవుడ్ తెరకి పరిచయమైంది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో రెండు, మూడు సినిమాలు చేస్తున్న మానుషీ చిల్ల‌ర్‌.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే భ‌విష్య‌త్తులో ఏ డైరెక్ట‌ర్ తో క‌లిసి ప‌ని చేయాల‌ని ఉంది..? అని ప్ర‌శ్నించ‌గా.. మానుషీ రాజ‌మౌళి పేరు చెప్ప‌డం విశేషం. ఆర్ఆర్ఆర్ సినిమా త‌నకు బాగా నచ్చిండ‌ని, రాజమౌళి దర్శకత్వంలో నటించాలని అనుకుంటున్నాన‌ని మానుషీ పేర్కొంది. ఏకంగా మాజీ ప్రపంచ సుందరే ఆ మాట అన‌డంతో రాజ‌మౌళి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాజ‌మౌళినా మాజాకా అంటూ తెగ ఉప్పొంగిపోతున్నారు.