2022లో బాలయ్య- బన్నీ సో స్పెషల్… ఆ హీరోలను మించిపోయారు గా..!

2022వ సంవత్సరం ముగిసిపోయింది 2023 కొత్త సంవత్సరం నిన్నటితో ఆరంభం అయింది. గ‌త సంవత్సరం బాక్సాఫీస్ వద్దకు ఎన్నో సినిమాల వచ్చాయి. బాలీవుడ్ సినిమాలతో చూసుకుంటే మన సౌత్ సినిమాలు సత్తా చాటాయి. దాని మన సౌత్ సినిమాలను మరో లెవల్ కు తీసుకువెళ్లినట్లు గా ఆర్ఆర్‌, కేజీఎఫ్, కాంతార, విక్రమ్ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపాయి.

2022 Tollywood Total HIT Movies List : T2BLive

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలైన అల్లు అర్జున్- బాలకృష్ణ సినిమాలో మినహా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు 2022లో ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. 2021 వ సంవత్సరం డిసెంబర్‌లో బాలయ్య అఖండ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాగా.. అల్లు అర్జున్ కూడా అదే నెలలో పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు కూడా 2022లో కూడా సందడి చేశాయి.

Akhanda All Time Fake Record! Pushpa Genuine Record | cinejosh.com

ఈ ఇద్దరు హీరోల సినిమాలు గత సంవత్సరం రాలేదనే ఫీలింగ్ అభిమానులకు రాలేదు. దానికి ముఖ్య కారణం పుష్ప సినిమాతో 2022 మొత్తం అల్లు అర్జున్ సందడి చేశారు. అఖండ సినిమాతో కూడా బాలయ్య 2022లో దుమ్మురేపాడు. ఇక దీంతోపాటు బాలయ్య అన్ స్టాపబుల్ షో మరియు వీర‌ సింహారెడ్డి అప్డేట్స్ తో ఎప్పుడు అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. అయితే 2022వ సంవత్సరంలో ఇద్దరు హీరోలు తమ సినిమాలను విడుదల చేయలేకపోయినా కూడా వార్తల్లో ఇతర హీరోలతో సమానంగా వారి హవా చూపించారు.

ఇక ఇద్దరిలో బాలకృష్ణ 2023 సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. గత సంవత్సరం సినిమా రానందుకు 2023 మొదటి లోనే తన కొత్త సినిమాను అభిమానుల ముందు తీసుకురాబోతున్నాడు బాలయ్య. బన్నీ పుష్ప సినిమాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని అభిమానులు కోరుకున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందోచూడాలి.