నెలకే పెద్దారెడ్డి చాపల పులుసు షాప్ ను క్లోజ్ చేసిన కిరాక్ అర్పి.. ఏం జరిగిందంటే..!!

తెలుగులో బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్ గా గుర్తింపు పొందారు కమెడియన్ కిరాక్ ఆర్పి. జబర్దస్త్ మానేసిన తర్వాత కొద్ది రోజులు స్టార్ మా లో కామెడీ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత బుల్లితెరకు దూరమై హైదరాబాదులో సొంతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. నాన్ వెజ్ ప్రియుల కోసం హైదరాబాదులో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుట ఒక షాప్ ని ఓపెన్ చేశారు. ఈ వ్యాపారం బాగా సాగుతుందని కిరాక్ ఆర్పి తెలియజేశారు. అంతేకాకుండా ప్రతిరోజు రూ.2 లక్షల రూపాయలు వస్తున్నట్లు తెలియజేశారు.

Kiraak RP Starts Nellore Pedda Reddy Chepala Pulusu Curry Point - Sakshi
దీంతో పలు నగరాలలో కూడా పెద్ద ఎత్తున కస్టమర్లు కిరాక్ ఆర్పి షాప్ కు వస్తూ ఉండడంతో రోజురోజుకి డిమాండ్ పెరుగుతూనే ఉందని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన షాప్ కి వచ్చే వాళ్లందరికీ తగిన ఐటమ్స్ అందించలేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆర్పి కొన్ని వీడియోలలో తెలియజేశారు. ఈ క్రమంలోనే కస్టమర్ల తాకిడి తట్టుకోలేక ఏకంగా వారం రోజులపాటు షాపును మూసీ వేసి పని వాళ్ల కోసం నెల్లూరుకి వచ్చానని తెలియజేశారు. నెల్లూరులో చేపల పులుసు వండే వారితోపాటు హోటల్లో పనిచేసే వారి కోసం వెతుకుతున్నట్లుగా సమాచారం.

చేపల పులుసు అద్భుతంగా చేసే వారికి తన దగ్గర ఉపాధి కల్పించడమే కాకుండా వారిని సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని భరోసా కల్పిస్తానని తెలిపారు కిరాక్ ఆర్పి. నెల్లూరు మహిళలు చేపలు కడిగే పద్ధతి మిగతా వారి కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలియజేశారు. అలాగే కట్టెల పొయ్యి మీద చేసేటువంటి చేపల పులుసు కూడా రుచికి తగ్గట్టుగానే ఉంటుందని తెలిపారు. ఇక తన వ్యాపారానికి మంచి ఆదరణ లభిస్తూ ఉండడంతో మ్యాన్ పవర్ కొరత కారణంగా.. డిమాండ్ సరిపడా కస్టమర్లకు ఐటమ్స్ అందించలేకపోతున్నామని దీంతో నిరాశగా వెళుతుంటే తనకు బాధ ఉందని త్వరలోనే నెల్లూరు నుంచి మంచి మాస్టర్ల తీసుకువచ్చి కర్రీ పాయింట్ తిరిగి ఓపెన్ చేస్తున్నానని తెలిపారు.