ఆ హీరోయిన్ గురించి హాట్ టాపిక్ గా మారుతున్న.. వాల్తేరు వీరయ్య మూవీ..!!

చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది.అయితే ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కేథరిన్ కూడా నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. కేథరిన్, రవితేజ పాత్రకి జోడి అయ్యుంటుంది అంటూ కొన్ని రోజుల క్రితం మీడియాలో తెగ వైరల్ గా వార్తలు వినిపించాయి. కానీ అందుకు సంబంధించి ఒక ఫోటో కానీ, విజువల్ కానీ ఇప్పటివరకు వాల్తేర్ వీరయ్య సినిమా నుంచి విడుదల కాలేదు.

Catherine Tresa: కేథరిన్ లేటెస్ట్ ఫోటో షూట్.. వైట్ టాప్‌లో ఏంజెల్‌లా  మెరిసిపోతున్న భామ..
దీంతో అసలు కేథరిన్ ఈ సినిమాలో ఉన్నదా లేదా అనే విషయాన్ని కూడా ఆమె అభిమానులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ నటించిన కొన్ని కారణాల చేత ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు. ఇప్పుడు రవితేజ పాత్ర పరిధి ఎక్కువగా ఉండటంవల్ల కేథరిన్ కూడా పాత్రను తొలగించారనే విషయం అందరిలోనూ సందేహంగా కలుగుతోంది. కేథరిన్ పాత్ర చిన్నది అయినప్పటికీ ఆమెకున్న క్రేజ్ ఉపయోగించుకునేందుకు ప్రమోషన్ ఈవెంట్లో ఆమె పోస్టర్ను కూడా చూపించలేదు. కనీసం ట్రైలర్లు అయినా కూడా ఈమెను ఒక్కసారిగా చూపించలేదు.

చిరంజీవి మూవీలో రవితేజ కన్ఫామ్, క్రేజీ క్యారెక్టర్..?? | NewsOrbit

ఇక పాటలలో మాత్రం కేథరిన్ కు ఛాన్స్ ఇవ్వలేదు దీంతో సినిమాలో ఈమె పాత్ర ఏంటి అన్న విషయం ఇంకా సందేహం గానే ఉంది. దీంతో ఈమె పాత్ర ఈ సినిమాలో చాలా తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే ఈమె పాత్రను కూడా తొలగించి ఉండవచ్చు అనే వార్తలు కూడ వైరల్ గా మారుతున్నాయి. మరి పూర్తి విషయం తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు క్లారిటీ రాదేమో అని చెప్పవచ్చు. ఇప్పుడు వాల్తేర్ వీరయ్య సినిమాలో కేథరిన్ గురించి ఈ విషయం వైరల్ గా మారుతొంది.