టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు..ఫిక్స్ అంటా!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి…అధికార వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా బలపడుతుంది..అదే సమయంలో టీడీపీతో పొత్తుకు జనసేన రెడీ అవుతుంది. ఇదే జరిగితే వైసీపీకి రిస్క్ పెరుగుతుంది. అప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోతాయి..దాని బట్టే కొందరు నేతలు జంపింగులకు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అధికారంలోకి వచ్చే ఊపు ఉన్న పార్టీలోకి నేతలు జంప్ చేసేందుకు చూస్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఏపీలో కొత్త చర్చ నడుస్తోంది..కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని, సమయాన్ని బట్టి వారు పార్టీ మారడం ఖాయమని టాక్. అయితే ఏ ఎమ్మెల్యే వస్తారనే విషయంపై క్లారిటీ లేదు..కానీ తాజాగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి విషయంలో కాస్త క్లారిటీ వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. తమ సొంత ప్రభుత్వంపైనే ఆనం వరుసగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

దీంతో జగన్..ఆనంని సైడ్ చేసి వెంకటగిరి బాధ్యతలు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. అంటే ఆనంని సైడ్ చేసినట్లు అయింది. అయితే ఆనం కూడా వైసీపీకి దూరం అవ్వడానికే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆనం కుమార్తె కైవల్య రెడ్డి టీడీపీలో చేరారు. ఇప్పుడు ఆనం సైతం టీడీపీలోకి వెళ్లడానికి రెడీ అయ్యారని ప్రచారం మొదలవుతుంది.

టీడీపీలోకి వెళ్లడానికే..వైసీపీపైన విమర్శలు వర్షం కురిపిస్తున్నారని, కావాలని జగన్ చేత పార్టీ నుంచి బయటకు పంపించేసేలా చేసుకుంటున్నారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఆనం టీడీపీలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. ఇటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం..ఇటీవల చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. పైగా మైలవరంలో మంత్రి జోగి రమేష్ తో ఆధిపత్య పోరు ఉంది. దీంతో వసంత సైతం వైసీపీని వీడి టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.