ఆ 6 సినిమాలు క‌లిపితే `వార‌సుడు`.. పెద్ద ఎత్తున పేలుతున్న సెటైర్లు!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్ లో రూపుతద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `వారసుడు(త‌మిళంలో వ‌రిసు)`. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ర‌ష్మిక హీరోయిన్ గా న‌టించింది.

శరత్ కుమార్, సుమన్, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్యామ్, జయసుధ, ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. విడుదల చేసిన కొద్ది సేప‌టికే సోషల్‌మీడియాలో ఈ ట్రైలర్‌ భారీ వ్యూస్‌తో దూసుకెళుతోంది. అభిమానులు ఈ ట్రైల‌ర్ బాగా ఆక‌ట్టుకుంది.

అయితే కొంద‌రు సినీ ప్రియులు మాత్రం ఈ మూవీపై పెద్ద ఎత్తున సెటైర్లు పేలుస్తున్నారు. మ‌హ‌ర్షి, అల వైకుంఠ‌పుర‌ములో, స‌రైనోడు, అత్తారింటికి దారేది, అజ్ఞాత‌వాసి, బ్ర‌హ్మోత్సం సినిమాల‌ను క‌లిపితే వార‌సుడు అంటూ దారుణ‌మైన కామెంట్స్ చేస్తున్నారు. అందుకు కార‌ణంగా తాజాగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్ ఆ ఆరు సినిమా షేడ్స్ క‌నిపించ‌డ‌మే. మ‌రికొంద‌రు అయితే వంశీ పైడిప‌డి గ‌త చిత్రం మ‌హ‌ర్షి సినిమాకు వార‌సుడు సీక్వెల్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. పైగా త‌మిళంలో ఈ సినిమా హిట్ అయినా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం క‌ష్ట‌మంటూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.