వైసీపీలో సీట్ల పంచాయితీ..వారికే గ్యారెంటీ?

ఎన్నికల ముందే 175 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధులని ప్రకటించి సత్తా చాటాలని అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో మాదిరిగా ఎన్నికల ముందు అభ్యర్ధులని ప్రకటించకుండా..ఎన్నికల మున్దే అభ్యర్ధులని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు అభ్యర్ధుల విషయంలో ఎప్పటికప్పుడు ఆచి తూచి అడుగులేస్తున్నారు. అయితే టీడీపీకి అభ్యర్ధులని ఫిక్స్ చేసే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ వైసీపీతో పోలిస్తే టీడీపీ సేఫ్.

ఎందుకంటే వైసీపీకి 175 సీట్లకు 151 ప్లస్ టీడీపీ, జనసేన నుంచి వచ్చిన 5 గురు ఎమ్మెల్యేలని కలుపుకుంటే 156 మంది ఉన్నారు. అంటే ఈ 156 మందికి మళ్ళీ సీట్లు ఇవ్వడం జరిగే పని కాదు. అలా అందరికీ సీట్లు ఇస్తే వైసీపీకే నష్టం. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. వారికి మళ్ళీ సీట్లు ఇస్తే వైసీపీకి రిస్క్. అందుకే జగన్ ముందు నుంచి పనితీరు బాగున్న వారికే సీట్లు ఇస్తామని చెబుతున్నారు. అలా అని ఎంతమంది ఎమ్మెల్యేలని తప్పిస్తారనేది పెద్ద ప్రశ్న.

ఇప్పటికే 50-60 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతుంది. వారందరికి సీట్లు ఇవ్వకపోవడం అనేది చాలా కష్టమైన పని. అందులో 30 మందికి సీట్లు ఆపిన రిస్క్ తప్పదు. ఎందుకంటే ఏ ఎమ్మెల్యేకైనా సీటు దక్కకపోతే..ఆ ఎమ్మెల్యే అసంతృప్తితో వైసీపీ గెలుపుకు కృషి చేసే అవకాశం ఉండదు.

దాని వల్ల ప్రత్యర్ధి పార్టీకి బెనిఫిట్ అవుతుంది. అలాంటప్పుడు సీట్లు దక్కని ఎమ్మెల్యేలకు వేరే ఆఫర్లు ఇవ్వాలి. మరి ఎంతమంది ఎమ్మెల్యేలకు ఆఫర్లు ఇచ్చి వారిని పక్కన పెడతారో చూడాలి.