తారక్ యాక్టింగ్‌పై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్.. ఫ్యాన్స్‌లో పూనకాలు

దర్శకుడు SS రాజమౌళి, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలోని గోల్డెన్ గ్లోబ్స్-2023 అవార్డుల కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చారు. అక్కడ తెలుగు యాక్షన్ కోలాహలం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), ఉత్తమ నాన్-ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయింది. జనవరి 10న జరిగే ప్రతిష్టాత్మక అవార్డు వేడుకకు ముందు, జనవరి 7న లాస్ ఏంజిల్స్‌లోని గౌరవనీయమైన DGA (డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా) థియేటర్‌లో జరిగిన RRR స్క్రీనింగ్‌కు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ప్రేక్షకులు వారికి పెద్ద ఎత్తున చప్పట్లతో ఆహ్వానించారు. సినిమా స్క్రీనింగ్ తర్వాత వీరిద్దరూ ప్రశ్నోత్తరాల సెషన్‌కు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశఆడు.

ఆస్కార్ 2023కి కూడా ఎంపికైన ఆర్ఆర్ఆర్ సినిమాపై దర్శకుడు రాజమౌళిని అక్కడ కొందరు ప్రశ్నించారు. వాటికి సమాధానాలిస్తూనే రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాట తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అయితే అదే సినిమాలోని కొమురం భీముడో సినిమాలో తనకు ఇంకా అత్యంత ఇష్టమైన పాట అని చెప్పాడు. అతను జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రశంసించాడు. తారక్‌పై తెరకెక్కించిన ‘కొమురం భీముడో’ పాట నా అన్ని చిత్రాలలో ఆల్ టైమ్ ఫేవరెట్ పాట అని చెప్పాడు. ఆ సన్నివేశం నేను దర్శకత్వం వహించిన అత్యుత్తమ విషయమని చెప్పాడు. కెమెరాను తారక్ కనుబొమ్మపై మాత్రమే ఉంచినా, అతను ఆ కనుబొమ్మతో అద్భుతంగా నటించగలడని రాజమౌళి పొగిడాడు.

ఇది విన్న తారక్ అభిమానులు తమ అభిమాన హీరోకు ఆస్కార్ రావడం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. రాజమౌళి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. తెలుగు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్‌ పాత్రల స్పూర్తితో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. దీనికి రాజమౌళి దర్శకత్వం వహించగా, ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించారు. RRR ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఆస్కార్‌ అవార్డు సాధించే క్రమంలో దూసుకుపోతోంది.