‘శాకుంతలం’ ట్రైలర్ : అమ్మా నాన్నలకి అక్కర్లేని తొలి బిడ్డ.. భూమాతకి కూడా భారమే.. ఎమోషన్ తో కట్టిపడేస్తున్న సమంత..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శాకుంతలం’ . వరుసగా అద్భుతమైన చిత్రాలలో నటిస్తూ పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సమంత నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని ఉంది . కాగా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే చిత్ర బృందం అఫీషియల్ గా విడుదల చేశారు. ట్రైలర్ స్టార్టింగ్ మొదలు ఎండింగ్ వరకు ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ ని అద్భుతంగా తెరకెక్కించాడు గుణశేఖర్ .

కాగా మరీ ముఖ్యంగా ఈ సినిమాకి ప్లస్ గా నిలిచింది సమంత అద్భుతమైన నటన ..కేవలం అందం పరంగానే కాదు నటన పరంగా కూడా సమంత ఈ సినిమాలో అదరకొట్టేసిందనే చెప్పాలి . మహాభారతంలో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని ఆధారంగా చేసుకుని గుణ శేఖర్ తెరకెక్కించిన ఎమోషనల్ జర్నీ నే ఈ ‘శాకుంతలం’.. అది ట్రైలర్ చూస్తే ఈజీగా అర్థమయిపోతుంది . కాగా శకుంతల ఎలా జన్మించింది ..?ఆ తర్వాత ఆమె జీవితంలోకి దుశ్యంతుడు ఎలా ప్రవేశించాడు..? ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న కష్టాలు ఏంటి అని ట్రైలర్లో క్లియర్గా చూపించాడు గుణశేఖర్ .

అంతేకాదు భూమి మీద అమ్మా నాన్నలకి అక్కర్లేని తొలి బిడ్డ.. మేనకా విశ్వామిత్రుల ప్రేమకి గుర్తుగా ఈ బిడ్డ పుట్టింది అనే అనే డైలాగ్ ట్రైలర్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . మరీ ముఖ్యంగా సమంత అపురూప సౌందర్యం ఈ సినిమాకి ప్లస్ గా మారినట్లు చెప్పవచ్చు. అంతేకాదు శకుంతల కర్మఫలం దుర్వాస మహర్షి శాప ఫలితం వల్ల శకుంతల కష్టాలు పాలవుతుంది.. ఆమె పడే కష్టాలు భూమాతకు సైతం భారమే అంటూ రాసిన డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి . మరి ముఖ్యంగా ట్రైలర్ చివర్లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ భరతుడి పాత్రలో సింహం మీద ఇచ్చే ఎంట్రీ ట్రైలర్ కి హైలెట్ అని చెప్పాలి . మొత్తంగా ఫిబ్రవరి 17న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ట్రైలర్ ఆధారంగా చెప్పేస్తున్నారు జనాలు..!!