ప్రపంచ సినీ చరిత్రలోనే ఏకైక రేర్ రికార్డు నందమూరి హీరోలకు సొంతం..!

చిత్ర పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఘనత నందమూరి ఫ్యామిలీది. ఈ కుటుంబం నుంచి ముందుగా సీనియర్ ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశారు. ఆయన ఒక నటుడు గానే కాకుండా డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలలో నటించారు. ఇక ఆయన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు. ఇప్పటికీ మనకి కృష్ణుడు, రాముడు పాత్రలు గుర్తుకొస్తే ముందుగా ఎన్టీఆర్ ఏ మన మదిలోకి వస్తారు.

సీనియర్ ఎన్టీఆర్ ఆయన నటించిన ప‌లు సినిమాలలో మూడు పాత్రలకు మించి నటించి మెప్పించారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన తర్వాత తరం హీరోల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడుగా ముందుగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ ఎప్పటికీ వరుస‌ సినిమాలు చేస్తూ ఇప్పుడున్న యువ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇక బాలకృష్ణ కూడా తన కెరీర్లో మూడు పాత్రలో నటించి మెప్పించారు. అధినాయకుడు సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా బాలయ్య నటనకు మాత్రం ప్రేక్షకుల‌ నుంచి మంచు మార్కులు పడ్డాయి.

బాలకృష్ణ తర్వాత వచ్చిన మూడో తరం నటుడు ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతూ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ కూడా జై లవకుశ సినిమాలో మూడు పాత్రలో నటించి తన నటనలోని వైవిధ్యం ప్రేక్షల‌కు చూపించి అదరగొట్టాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని జై పాత్రకు మాత్రం ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ కూడా వచ్చింది. ఇక ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించి 85 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది.

ఇప్పుడు మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా అమీగోస్‌ సినిమాలో మూడు పాత్రలలో నటించాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా నిన్న విడుదలవుగా ప్రేక్షకుల నుంచి మంచి వ్యూస్ ను రాబట్టుకుంటుంది. ఇక ఎప్పుడూ ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన నలుగురు హీరోలు తమ సినిమాలలో మూడు పాత్రలో వేరువేరు సినిమాల్లో నటించడం ప్రపంచంలోనే రికార్డ్ అని కామెంట్లు వస్తున్నాయి.
ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ కలిసి ఒకే సినిమాలో నటించకపోయిన తారక్ హీరోగా వస్తున్న సినిమాలకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నందమూరి హీరోలు కలెక్షన్ల పరంగా కూడా ఎన్నో సెన్సేషనల్ రికార్డులు కూడా క్రియేట్ చేస్తూ తమ జైత్రయాత్రని కొనసాగిస్తున్నారు.